Begin typing your search above and press return to search.

రకుల్ బాగానే పిండుకుంటోంది..

By:  Tupaki Desk   |   9 Oct 2015 1:30 AM GMT
రకుల్ బాగానే పిండుకుంటోంది..
X
యంగ్ జనరేషన్ లో స్టార్ హీరోయిన్ రేసులో ఉన్న ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ ఒకరు. ఈ పంజాబీ పోరిని ఇంకా స్టార్ హీరోయిన్ గా గుర్తించలేదు ఇండస్ట్రీ. కానీ అందలానికి రకుల్ అడుగు దూరంలో ఉందంతే. అందుకే రేంజ్ పెంచేసింది. ఇప్పటివరకూ పట్టుమని యాభై లక్షలు కూడా రకుల్ ప్రీత్ రెమ్యూనరేషన్.. ఒక్కసారిగా కోటిన్నరకి చేరిపోయింది.

ఒక్కసారిగా పారితోషికాన్ని మూడు రెట్లు పెంచేసి.. అందరికీ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇచ్చేసింది. ఇంతా చేస్తే.. ఈ భామ ఇప్పటివరకూ చేసింది 12 సినిమాలు మాత్రమే. ఆరేళ్లుగా ఇండస్ట్రీలో కొట్టుమిట్టాడుతున్నా.. సరైన హిట్ ఒకటి కూడా పడలేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తప్ప హిట్ అనే మాట కూడా వినిపించలేదు ఇప్పటివరకూ. ఈమె నటించిన ఫస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ కిక్2 కూడా తన్నేసింది. అయితే.. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేసిన బ్రూస్ లీ రిలీజ్ కి రెడీగా ఉండడం, బన్నీ, ఎన్టీఆర్ ల సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.

వీటిలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా.. టాప్ స్టేజ్ కి వెళ్లడం ఖాయం. అందుకే ఆఫర్స్ క్యూ కట్టేస్తున్నాయి. ఎలాగూ హిట్ వస్తుందన్న కాన్ఫిడెన్స్ తో... ముందుగానే రేటును పెంచేసింది రకుల్. కెరీర్ లో బ్లాక్ బస్టర్ ఒకటి కూడా లేకుండా.. లెక్క కోటి దాటించేసిన మొదటి హీరోయిన్ రుకుల్ ప్రీత్ సింగ్ ఒకతే.