రకుల్ చేతిలో ఉన్నవి ఇవేనట

Thu Jun 21 2018 07:00:01 GMT+0530 (IST)

టాలీవుడ్ లో గ్లామర్ బ్యూటీగా అందరిని ఆకర్షించిన రకుల్ ప్రీత్ తొందరగానే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా అవకాశాలను దక్కించుకోవడంలో అమ్మడు ఆరి తీరిందననే చెప్పాలి. గత ఏడాది స్పైడర్ దెబ్బకు బేబీ మళ్ళి కనిపించదని వివిధ రకాల కామెంట్స్ వచ్చినప్పటికీ తన గ్లామర్ తో అవకాశాలను గట్టిగానే రాబట్టింది. అది కూడా బాలీవుడ్ సినిమాలు అవ్వడం గొప్ప విషయమనే చెప్పాలి.ఈ ఏడాది మొదట్లో నీరజ్ పాండే డైరెక్ట్ చేసిన అయ్యారి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ఆ తరువాత వెంటనే మరో సినిమా ఓకే చేసింది. అజయ్ దేవగన్ తో అర్బన్ రొమాంటిక్ కామెడీ కథలో మంచి పాత్రే దొరికినట్లు ఇటీవల ఒక ఈవెంట్ లో తెలిపింది. ఆ సినిమా ద్వారా తప్పకుండా మరిన్ని ఆఫర్స్ కూడా వస్తాయని అంతలా అందరికి నచ్చుతుందని కూడా వివరించింది. ఇక రకుల్ చేతిలో ప్రస్తుతం బాలీవుడ్ లో మరో ప్రాజెక్ట్ లు లేవు గాని సౌత్ లో ఉన్నాయని చెప్పింది.

తమిళ్ లో ఆల్ రెడీ మూడు కథలకు ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. అందులో సూర్య కార్తీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక శివకార్తికేయన్ తో కూడా రకుల్ ఒక సినిమా చేస్తోంది. తెలుగులో రెండు ప్రాజెక్టులు ఉన్నాయని మొన్నటి రూమర్స్ వచ్చాయి. కానీ ఒక సినిమా మాత్రమే తన చేతిలో ఉన్నట్లు రకుల్ తెలియజేసింది.