ఫోటో స్టోరి: శ్రీదేవి డూప్ లా ఉందే!

Mon Dec 17 2018 13:46:50 GMT+0530 (IST)

సాక్షాత్తూ అతిలోక సుందరి శ్రీదేవి భువి కి దిగి వచ్చిందా?  భూమ్మీద మానవుల్ని పలకరించేందుకే ఇలా వచ్చిందా?  ప్చ్..! ఈ భామ ను ఇలా చూడగానే కుర్రకారు లో సందేహమిది. ఏదో సినిమాలో అవకాశం వచ్చింది కదా అని అతిలోక సుందరిగా అభినయిస్తోంది అనుకుంటే పొరపాటే. శ్రీదేవి యాటిట్యూడ్ ని అన్నిచోట్లా చూపిస్తోంది ఈ పంజాబీ కుడి. తనని తాను శ్రీదేవి అంత అందంగా ఆవిష్కరించుకునేందుకు తహతహలాడుతోంది. ఒక వేళ డౌట్ గా ఉంటే ఇదిగో ఈ ఫోటోలు చూస్తే సరిపోతుంది.



అచ్చం `జగదేక వీరుడు అతిలోక సుందరి` సినిమా లో ఇంద్రజనే తలపిస్తోంది. మిరుమిట్లు గొలిపే లెహెంగా డిజైనర్ డ్రెస్..  కాంబినేషన్ వజ్రాల హారం... ఆ బూరె బుగ్గలు.. కాటుక కళ్లు చూడగానే ఇంద్రుని తనయ దిగి వచ్చిందే అని కంగారు పడిపోవాలంతే!! ఫక్తు మోడ్రన్ అప్పీల్ ఉన్న అతిలోక సుందరి అని అభిమానులు ఫిక్సయిపోయారు. ఇంతకీ ఇలా ఎక్కడ దర్శనమిచ్చింది రకుల్? అని ప్రశ్నిస్తే ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన సైనా నెహ్వాల్ - పారుపల్లి కశ్యప్ జంట వివాహ రిసెప్షన్ వేడుక లో రకుల్ ఇలా తళుక్కుమంది. ఇండస్ట్రీ బెస్ట్ సెలబ్రిటీలతో రకుల్ స్నేహం ఈ సందర్భంగా రివీలైంది. ఈ డ్రెస్ ని కోన నీరజ డిజైన్ చేశారు కాబట్టి ఆ క్రెడిట్ లో కొంత తనకే ఇవ్వాల్సి ఉంటుంది.