Begin typing your search above and press return to search.

ఆమెతో లిప్‌ కిస్సా? వామ్మో!!

By:  Tupaki Desk   |   7 Oct 2015 3:30 AM GMT
ఆమెతో లిప్‌ కిస్సా? వామ్మో!!
X
హీరోల‌కు పెద‌వి తాంబూలం అందించ‌డంలో యంగ్ హీరోయిన్ ర‌కూల్ ప్రీత్ య‌మ‌స్పీడు. ఈ సంగ‌తి ఇప్ప‌టికే ప్రూవ్డ్‌. ఈ భామ కెరీర్ ఆరంభ‌మే కుర్ర‌ హీరోల‌తో లిప్‌లాక్‌లు వేసేసింది. అవ‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడు లేటెస్టుగా బ్రూస్‌లీ చిత్రంలో రామ్‌చ‌ర‌ణ్‌తోనూ అదే తీరుగా లిప్ లాక్ వేసి ఉంటే అది ఓ ఫ్లాప్‌కి దారి తీయొచ్చ‌ని విశ్లేషిస్తున్నారు కొంద‌రు ఎన‌లిస్టులు. అదెలాగంటారా? లెటజ్‌ సీ..

ర‌కూల్ ప్రీత్ సింగ్ ఇప్ప‌టివ‌ర‌కూ రెండు సార్లు హీరోల‌తో సుదీర్ఘ అద‌ర‌చుంబ‌నాల్లో పాల్గొంది. హిందీ డెబ్యూ ఫిలిం యారీయాన్‌లో కుర్ర‌హీరోతో నిమిషం పైగానే ఘాటైన చుంబ‌నం చేసింది. ఆ సినిమా ఫ్లాప్‌. అలాగే ఆదికి ర‌ఫ్ సినిమాలో అంతే ఘాటైన చుంబ‌నం ఇచ్చింది. ఇక్క‌డ ఇది కూడా ఫ్లాపే. ముచ్చ‌ట‌గా మూడో ముద్దు మాస్ మ‌హారాజ్‌కి ఇచ్చింది. అందుకే కిక్‌2 అట్ట‌ర్ ఫ్లాపైంది. కాబ‌ట్టి ఈసారి బ్రూస్‌లీతోనూ లిప్ లాక్ లాగించేసి ఉంటే సెంటిమెంటు ప్ర‌కారం .. అదే ఫ్లాప్ రిపీట‌వుతుంద‌ని కొంద‌రు కొంటె ఎన‌లిస్టులు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.

అస‌లే ర‌కూల్ ప్రీత్ అంద‌చందాల్ని తెర‌నిండుగా ప‌రిచేస్తోంది. ఇప్పుడు లిప్‌లాక్‌ల‌తోనూ సెన్సేష‌న్‌ చేస్తే ప‌రిస్థితి ఇంకేమైపోతుందో? అస‌లే చెర్రీ బోలెడన్ని హోప్ప్‌ తో ఉన్నాడు. ఈసారి ఓవ‌ర్సీస్ మార్కెట్ పైనా గురి పెట్టాడు. ఇలాంటి టైమ్‌లో సెంటిమెంటు తేడా కొడితే అంతే సంగ‌తి. ర‌కూల్ ప్రీత్ పెద‌వి ముద్దు అప్పుడు మ‌రింతగా డిష్క‌స‌న్‌లోకి వ‌స్తుంది. రాకూడ‌ద‌నే భావిద్దాం.