Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరోయిన్‌ సోదరుడిని దింపేసింది

By:  Tupaki Desk   |   23 Feb 2019 6:47 AM GMT
స్టార్‌ హీరోయిన్‌ సోదరుడిని దింపేసింది
X
హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ రెండు ఏళ్ల క్రితం ప్రచారం జరిగింది. సినిమాల్లో ఎంట్రీ కోసం అమన్‌ నటనలో శిక్షణ తీసుకుంటున్నాడని, సోదరి రకుల్‌ కి ఉన్న బ్యాక్‌ గ్రౌండ్‌ మరియు పరిచయాలతో అమన్‌ హీరోగా పరిచయం అవ్వడం చాలా సులభం అనుకున్నారు. అయితే అమన్‌ మొదటి సినిమా అనుకున్నంత త్వరగా అయితే ప్రారంభం అవ్వలేదు. ఎట్టకేలకు అమన్‌ సినిమా పట్టాలెక్కబోతుంది.

నాగశౌర్యతో గతంలో 'నీ జతలేక' చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు దాసరి లారెన్స్‌ ఇప్పుడు తన రెండవ సినిమాను రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడు అమన్‌ తో చేసేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రంలో హీరోయిన్‌ గా కొత్త అమ్మాయి మోనిక శర్మ ఎంపిక అయ్యింది. రజినీ ఫిల్మ్‌ కార్పోరేషన్‌ బ్యానర్‌ లో ఈ మూవీ నిర్మాణం జరుగబోతుంది. రేపు ఈ చిత్రం పూజా కార్యక్రమాలు జరుగబోతున్నాయి. తెలుగులో తన సోదరుడిని సక్సెస్‌ ఫుల్‌ హీరోగా చూసేందుకు రకుల్‌ ఆరాటపడుతుంది. మరి అమన్‌ మొదటి సినిమాతో సక్సెస్‌ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.