Begin typing your search above and press return to search.

ఎల‌గెల‌గెలాగ‌..చ‌ర‌ణ్‌ తో మ‌ళ్లీ ర‌కులేనా?!

By:  Tupaki Desk   |   7 Feb 2016 5:19 AM GMT
ఎల‌గెల‌గెలాగ‌..చ‌ర‌ణ్‌ తో మ‌ళ్లీ ర‌కులేనా?!
X
రామ్‌ చ‌ర‌ణ్ త‌ని ఒరువ‌న్ రీమేక్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఆ చిత్రం ఈ నెల‌లోనే కొబ్బ‌రికాయ కొట్టుకుంటుంది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు స్క్రిప్టుపైనే దృష్టిపెట్టిన చిత్ర‌బృందం తాజాగా హీరోయిన్‌ ని ఎంపిక చేసే ప‌నిలో ప‌డిపోయింద‌ట‌. విశ్వ‌స‌నీయం స‌మాచారం మేర‌కు ఈ సినిమాలో క‌థానాయిక‌గా ర‌కుల్‌ ప్రీత్ సింగ్ న‌టిస్తుంద‌ని తెలిసింది. రామ్‌ చ‌ర‌ణ్ త‌ని ఒరువ‌న్ రీమేక్‌ లో న‌టిస్తున్నాడ‌న్న విష‌యం బ‌య‌టికొచ్చిన‌ప్ప‌ట్నుంచే ఇందులో హీరోయిన్‌ గా ఎంపికైందంటూ పలువురు క‌థానాయిక‌ల పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయితే చిత్ర‌బృందం మాత్రం ఆ విష‌యంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇటీవ‌లే హీరోయిన్ ఎంపిక ప్ర‌క్రియ పూర్త‌యింది కాబ‌ట్టి త్వ‌ర‌లోనే ఆ వివ‌రాల్ని బ‌య‌ట‌పెట్టే అవ‌కాశాలున్నాయ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

రామ్‌ చ‌ర‌ణ్‌ తో క‌లిసి బ్రూస్‌ లీలో న‌టించింది ర‌కుల్‌. ఎలగెల‌గెల‌గా... అంటూ రామ్‌ చ‌ర‌ణ్, ర‌కుల్ క‌లిసి చేసిన సంద‌డి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. సినిమా ఫెయిల్యూర్ అయిన‌ప్ప‌టికీ వాళ్ల కాంబినేష‌న్ మాత్రం సూప‌ర్బ్ అనిపించింది. అందుకే సురేంద‌ర్ రెడ్డి హీరోయిన్‌ గా ర‌కుల్‌ ప్రీత్ సింగ్‌ ని ఎంచుకొందామ‌ని చెప్పాడ‌ట‌. చ‌ర‌ణ్ కూడా అందుకే ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మొద‌ట కాజ‌ల్ - కీర్తి సురేష్ పేర్లు ప‌రిశీలించిన‌ప్ప‌టికీ వాళ్ల డేట్లు అడ్జ‌స్ట్ కాలేద‌ని స‌మాచారం. అందుకే మళ్లీ ర‌కుల్‌ నే ఎంచుకొన్నార‌ని చెప్పుకొంటున్నారు. మ‌రి ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం అధికారికంగా ధృవీక‌రించాల్సి వుంది.