Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: జ్యూయలరీతో గ్లామర్ ఒలికించిందే!

By:  Tupaki Desk   |   18 July 2019 5:51 AM GMT
ఫోటో స్టొరీ: జ్యూయలరీతో గ్లామర్ ఒలికించిందే!
X
బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనేముంది? టాలీవుడ్ దాదాపుగా అందరు టాప్ స్టార్లతో నటించి.. హిట్స్ కూడా సాధించిన రకుల్ జోరు ఇప్పటికీ తగ్గలేదు. మధ్యలో హిందీ.. తమిళ సినిమాలపై ఫోకస్ చేసేసరికి తెలుగులో సినిమాలు తగ్గిన మాట వాస్తవమే కానీ తెలుగుపై మళ్ళీ ఫోకస్ చేసింది. ఇక సోషల్ మీడియాలో రకుల్ జోరు మామూలుగా ఉండదు. రెగ్యులర్ గా అప్డేట్స్ ఇచ్చే భామ కావడంతో భారీగా ఫాలోయింగ్ ఉంది.

రకుల్ ఈమధ్య ముంబైలో జరుగుతున్న గ్లామర్ జ్యూయలరీ ఎగ్జిబిషన్ కు హాజరైంది. అసలే నాజూకైన భామ.. పైగా ఈమధ్య బాలీవుడ్ చిత్రమం 'దేదే ప్యార్ దే' కోసం జీరో సైజ్ కు మారింది. దీంతో తన లుక్స్ ముంబై గ్లామర్ బ్యూటీలకు తగ్గట్టుగానే ఉన్నాయి. సాధారణంగా రకుల్ మోడరన్ దుస్తులలో కనిపిస్తుంది. ఎక్కువగా అభరణాలు ధరించే భామ కాదు. కానీ ఈ ఎగ్జిబిషన్ థీమే గ్లామర్ జ్యూయలరీ కావడంతో ఆభరణాలు ఫుల్లుగా ధరించి సూపర్ పోజులిచ్చింది. మెడలో నెక్లెస్ లు చైన్లు.. చెవులకు ఇయర్ రింగ్స్.. చేతికి ఒక గాజు.. వేళ్ళకు ఉంగరాలు ధరించి కొత్తగా కనిపిస్తోంది. అలా అని ఓన్లీ ఆభరణాలు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. డీప్ వీ నెక్ ఉన్న టాప్ ధరించి అందాల వడ్డన కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

తెలుపు రంగు చుక్కలున్న నీలం రంగు గౌన్ లో బొమ్మలాగా కనిపించింది. ఈ గెటప్ కు హెయిర్ స్టైల్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. రకుల్ ఎక్స్ ప్రెషన్ కూడా ఎంతో సెన్సువల్ గా ఉంది. రకుల్ సినిమాల విషయానికి వస్తే అక్కినేని నాగార్జున లేటెస్ట్ ఫిలిం 'మన్మథుడు 2' లో హీరోయిన్ గా నటిస్తోంది. శివ కార్తికేయన్ హీరో గా నటిస్తున్న ఒక తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు కాకుండా హిందీలో 'మర్జావా' అనే చిత్రంలో కూడా రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది.