Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: సెక్సీ రకుల్ ఈజ్ బ్యాక్

By:  Tupaki Desk   |   20 Nov 2018 8:24 AM GMT
ఫొటో స్టోరీ: సెక్సీ రకుల్ ఈజ్ బ్యాక్
X
రెండేళ్ల ముందు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగే. ‘నాన్నకు ప్రేమతో’.. ‘సరైనోడు’.. ‘ధృవ’.. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ లాంటి హిట్లతో దూసుకెళ్లిందామె. మిగతా స్టార్ హీరోయిన్లు జోరు తగ్గించేస్తున్న సమయంలో రకుల్ మామూలు ఊపు చూపించలేదు. వరుసగా బడా స్టార్లతో సినిమాలు చేస్తూ దక్షిణాదిన అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా కనిపించింది రకుల్. కానీ ఇంత జోరుమీదున్న ఆ భామ.. ఉన్నట్లుండి డౌన్ అయిపోయింది. ఏడాది తిరిగేసరికి తెలుగులో ఛాన్సులే లేని పరిస్థితికి చేరుకుంది. ‘స్పైడర్’ తర్వాత ఇప్పటిదాకా రకుల్ తెలుగులో లీడ్ హీరోయిన్‌ గా ఒక్క అవకాశం కూడా దక్కించుకోలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. వరుస ఫ్లాపులకు తోడు గ్లామర్ దెబ్బ తినడం కూడా రకుల్‌ కు చేటు చేసిందని భావిస్తున్నారు.

ఐతే ఈ మధ్య రకుల్ గ్లామర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధే పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల రకుల్ ఫొటో షూట్లన్నీ రచ్చ లేపుతున్నాయి. ఈ మధ్యే వర్కవుట్ డ్రెస్సులో రకుల్ లుక్ చూసి కుర్రాళ్లకు మతి పోయింది. మధ్యలో బక్క చిక్కి కనిపించిన రకుల్.. మళ్లీ ఒళ్లు చేస్తున్నట్లుంది. ఓవరాల్‌ గా ఆమె లుక్ మెరుగైంది. తాజాగా రకుల్ చేసిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో షూట్ కుర్రాళ్ల దృష్టిని బాగా ఆకర్షిస్తోంది. క్లీవేజ్ షోతో కిర్రెక్కిస్తోందామె. రకుల్ ముఖంలోనూ గ్లో పెరగింది. మొత్తంగా ఇటీవలి ఫొటో షూట్లు చూసి రకుల్ ఈజ్ బ్యాక్ అంటున్నారు జనాలు. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘యన్.టి.ఆర్’లో అతిథి పాత్ర మాత్రమే చేస్తోంది. తమిళ.. హిందీ భాషల్లో ఆమెకు అవకాశాలు బాగానే ఉన్నాయి. రకుల్ రచ్చ చూస్తుంటే తెలుగులోనూ మళ్లీ మంచి ఛాన్సులు అందుకునేలా కనిపిస్తోంది.