ఫోటో స్టోరీ : చినిగినా సింగారమే

Thu Nov 15 2018 20:00:01 GMT+0530 (IST)

కాలంతో పాటే ట్రెండ్ మారుతోంది. ముఖ్యంగా ఫ్యాషన్ లో వచ్చిన మార్పు అసాధారణం. ఇప్పుడు యువతరం చినుగుల జీన్స్.. టాప్స్ ధరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నిఫ్ట్ లో ఫ్యాషన్ స్టూడెంట్స్ చేసే ప్రయోగాలకు - క్రియేటివిటీకి అంతూ దరీ లేదు. పలువురు టాప్ ఫ్యాషన్ డిజైనర్స్ సినీరంగంలో టాప్ ఎర్నర్స్ గా హవా సాగిస్తున్న వైనం తెలుస్తున్నదే.అదంతా అటుంచితే.. ఇదిగో ఇక్కడున్న చక్కనమ్మ చినుగుల డ్రెస్ లో ఎంత వేడిగా ఫోజిచ్చిందో చూడండి. ఆ క్రీగంటి చూపుతో కోసేస్తోంది. కింద చినిగిన డెనిమ్ జీన్స్ .. టాప్ లోనూ అదే తీరుగా చినిగిన కర్చీఫ్ లాంటి ఫ్రాకులో వేడి పెంచేస్తోంది. పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ యువతరం నాయికల్లో ఎంతో స్పీడ్ గా ఉంటుందనడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు.

ప్రస్తుతం ఈ భామ అటు కోలీవుడ్ - బాలీవుడ్ లో తనవైపు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తోంది. కోలీవుడ్ లో సూర్య - కార్తీ - శివకార్తికేయన్ వంటి స్టార్ల సరసన నటిస్తోంది. బాలీవుడ్ లో తన ఫేవరెట్ సిద్ధార్థ్ మల్హోత్రా సరసన అవకాశం అందుకుంది. ఆ సినిమా త్వరలో ప్రారంభం కానుంది. వీటితో పాటు మరోవైపు జిమ్ బిజినెస్‌లోనూ రకుల్ రకరకాల ప్లానింగ్స్ తో దూసుకుపోతోంది.