Begin typing your search above and press return to search.

రకుల్ దేదే అంటే నైనై అన్నారు

By:  Tupaki Desk   |   18 May 2019 4:53 AM GMT
రకుల్ దేదే అంటే నైనై అన్నారు
X
మొన్నటిదాకా ఇక్కడ చక్రం తిప్పిన టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ హిందిలో జెండా పాతేందుకు గట్టి ప్రయత్నమే చేస్తోంది. గత ఏడాది అయారి మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది నమ్మకాన్ని వమ్ము చేసి డిజాస్టర్ గా మిగిలింది. అందుకే అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరోతో చేసిన దేదే ప్యార్ దే తనకు ఖచ్చితమైన బ్రేక్ అవుతుందనే నమ్మకంతో గ్లామర్ పరంగా ఎలాంటి మొహమాటం లేకుండా ఓపెన్ గా నటించేసింది.

ఇప్పుడీ సినిమా విడుదలైపోయింది. క్రిటిక్స్ పెదవి విరిచారు. ట్రైలర్ లో చూపించిన కంటెంట్ తప్ప ఇందులో ఏమి లేదని తేల్చి చెప్పేశారు. ఆడియన్స్ సైతం ఆశించిన స్థాయిలో ఎంటర్ టైన్మెంట్ లేదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కామెడీని సరిగా డీల్ చేయకపోవడం ఊహించినట్టే కథనం సాగడం ప్రధాన మైనస్ గా చెబుతున్నారు. అజయ్ దేవగన్ లాంటి స్టార్ హీరో చేయాల్సిన మెటీరియల్ కాదని అధిక శాతం చెప్పిన మాట

ఈ లెక్కన రకుల్ ప్రీత్ సింగ్ ఈ దేదే ప్యార్ దే కోసం ఎంత అందం ఒలకబోసినా అది వర్క్ అవుట్ కాలేదన్న మాట. కమర్షియల్ గా ఓ మాదిరి వసూళ్లు వచ్చినా పెద్ద రేంజ్ కు వెళ్ళే ఛాన్స్ లేదని ట్రేడ్ నుంచి వస్తున్న రిపోర్ట్. పెళ్లీడుకొచ్చిన పిల్లలున్న యాభై ఏళ్ళ తండ్రి పాతికేళ్ళ యువతి ప్రేమలో పడటం అనే పాయింట్ ని దర్శకుడు అకివ్ అలీ సరిగా ట్రీట్ చేయలేకపోవడంతో మొత్తం ప్రహసనంగా మారి ఏ ప్రత్యేకత లేని చిత్రంగా మిగిలిపోయింది.

రకుల్ రెచ్చిపోయింది కాని పాటలు సోసోగా ఉండటంతో రెస్పాన్స్ అంతంత మాత్రమే. మొత్తానికి రకుల్ దేదే ప్యార్ దే(తెలుగులో ఇవ్వు ఇవ్వు ప్రేమ ఇవ్వు) అంటే అక్కడి వాళ్ళు మాత్రం నైనై(వద్దు వద్దు) అనేశారు. సో ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేయక తప్పదు . తమిళ్ లో సైతం ఇలాంటి ఫలితాలే అందుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్ ఆ ఆరబోతేదో తెలుగులోనే చేస్తే ఆఫర్లు మళ్ళి క్యు కట్టవచ్చేమో.