Begin typing your search above and press return to search.

చెర్రీ అంటే ఓకే కానీ.. ర‌కుల్ కూడానా?!

By:  Tupaki Desk   |   7 Oct 2015 2:30 PM GMT
చెర్రీ అంటే ఓకే కానీ..  ర‌కుల్ కూడానా?!
X
శ్రీనువైట్ల క‌సిమీదున్నాడు. ఆగ‌డు ప‌రాజయం ప్ర‌భావం నుంచి వీలైనంత త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డాల‌నుకొంటున్నాడు. అందుకే 'బ్రూస్‌లీ'ని మొద‌లుపెట్టిన రోజే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించి, ఆ తేదీకే సినిమాని విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌యిపోయాడు. అందుకోసం త‌న టీమ్‌ని ప‌రుగులు పెట్టిస్తున్నాడు. కానీ శ్రీనువైట్ల‌, అత‌ని టీమ్ మాత్రమే స్పీడుమీదుంటే స‌రిపోదు క‌దా!. హీరో హీరోయిన్ల స‌హ‌కారం కూడా కావాలి. వాళ్ల స‌హ‌కారం లేక‌పోతే ఎవ‌రేం చేసినా వృథానే. అయితే బ్రూస్‌లీ హీరో హీరోయిన్లు రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్‌ల నుంచి శ్రీనువైట్ల‌కి పూర్తి స‌హ‌కారం ల‌భిస్తోంది. ఎంత‌గా అంటే శ్రీనువైట్ల ఒక పాట‌ని మూడు రోజుల్లో పూర్తి చేయాల‌ని టార్గెట్ పెడితే దాన్ని వీళ్లు డే అండ్ నైట్ చేసి రెండ్రోజుల్లోనే పూర్తి చేసేంత‌గా. ఈ ఇద్ద‌రూ లీ లీ బ్రూస్‌లీ... అనే పాట‌ని అలాగే కంప్లీట్ చేశారు.

ఇటీవ‌లే లీ లీ పాట‌ని రామోజీ ఫిల్మ్‌సిటీలో తీశారు. అది మంగ‌ళ‌వారం రాత్రిలోపు పూర్తి చేయాల‌ని మాట‌. అయితే రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ డే అండ్ నైట్ షూట్ చేసి మంగ‌ళ‌వారం ఉద‌యం ఆరు గంట‌ల‌కే పూర్తి చేశార‌ట‌. దీంతో యూనిట్ హీరో హీర‌యిన్ల‌ను తెగ పొగిడేస్తోంది. రామ్‌చ‌ర‌ణ్ ఆమ‌ధ్య ఓ పాట కోసం ఏకంగా 17 గంట‌లు షూటింగ్ చేసిన విష‌యం తెలిసిందే. రామ్‌చ‌ర‌ణ్ చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ఆయ‌న స్ట్రెంగ్తే అది. కానీ హీరోయిన్లు అలా ఏక‌ధాటిగా డ్యాన్స్ చేయ‌డం క‌ష్టం క‌దా. కానీ ర‌కుల్ మాత్రం నేను కూడా త‌గ్గే ప్ర‌స‌క్తే లేదంటూ ఆమె కూడా చ‌ర‌ణ్‌తో పోటీప‌డి మ‌రీ డ్యాన్సులేసింద‌ట‌. అది చూసి రామ్‌చ‌ర‌ణే ర‌కుల్‌కి హ్యాట్సాఫ్ చెప్పాడ‌ట‌. ఆడియో ఫంక్ష‌న్లోనూ చ‌ర‌ణ్ అదే చెప్పాడు. ర‌కుల్‌తో నేను పోటీప‌డాల్సి వ‌చ్చింద‌న్నాట‌. ఇప్పుడు మ‌రోసారి అది నిజం చేసింది ర‌కుల్‌. బ్రూస్‌లీ టీమ్‌కే కాదు... వేరే ఏ సినిమాలో ప‌నిచేసినా ర‌కుల్ క‌మిట్‌మెంట్ ఇలాగే ఉంటుంద‌ట‌. అందుకే ఆమెకోసం నిర్మాత‌లు క్యూ క‌డుతుంటారు.