Begin typing your search above and press return to search.

కండీషన్‌ పెడితేనే చరణ్‌ తో సెట్టయ్యేది

By:  Tupaki Desk   |   9 Oct 2015 3:54 AM GMT
కండీషన్‌ పెడితేనే చరణ్‌ తో సెట్టయ్యేది
X
ఇంతకీ రామ్‌ చరణ్‌ సరసన యక్టింగ్‌ చేయాలంటే ఏదైనా స్పెషల్‌ కండీషన్‌ పెట్టాలా? పెట్టాల్సిందే అంటోంది అందాల భామ రకూల్‌ ప్రీత్‌ సింగ్‌. ఒకవేళ పెట్టకపోతే చరణ్‌ మనల్ని డామినేట్‌ చేసేసి ఉతికి ఆరేశేయడూ అంటోంది అమ్మడు. అసలు ఇంతకీ బ్రూస్‌ లీ సినిమాలో చెర్రీ సరసన రియా పాత్రలో మెరిసిన ఈ సొగసరి.. ఎలాంటి కండీషన్‌ పెట్టిందట?

అబ్బే ఏం లేదండీ.. చరణ్‌ ప్రక్కన ఎంత గ్లామరస్‌ గా కనిపించినా కూడా.. పాటల వరకు వస్తే మాత్రం మనోడు తన డ్యాన్సింగ్‌ టాలెంట్‌ తో తొక్కేస్తాడు. అలా తొక్కేస్తాడనే తను ఓ ఉపాయం కనుక్కుందట. ''చరణ్‌ ఎలాగో డ్యాన్సులు ముందుగా ప్రాక్టీస్‌ చేయడు. కేవలం సెట్టుకు వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించి తెలుసుకొని.. ఆ స్టెప్పులను వేసేస్తుంటాడు. ఒకవేళ మనోడు ప్రాక్టీస్‌ చేసి వేస్తే దాని అవుట్‌ పుట్‌ వేరేలా ఉంటుందిలే. ఇక ఎలాగో చరణ్‌ అప్పటికప్పుడే చేస్తాడని తెలుసు కాబట్టి.. నేను మాత్రం రెండు మూడు రోజుల ముందే స్టెప్పులన్నీ తెలుసుకొని కాస్త గట్టిగా ప్రాక్టీస్‌ చేశా.. అందుకే చరణ్‌ తో మ్యాచ్‌ చేయగలిగా..'' అంటూ ఈమె చరణ్‌ యునిట్‌ కు డ్యాన్సులు విషయంలో కండీషన్‌ పెట్టినట్లు వెల్లడించింది.

ఇకపోతే బ్రూస్‌ లీ సినిమాలో చరణ్‌ సరసన కనుక క్లిక్కయితే రకుల్‌ కు అంతకంటే పెద్ద విక్టరీ ఏముంటుందిలే. ఈమె కెరియర్‌ లో ఇదే అతి పెద్ద స్టార్‌ హీరో సినిమా. ఈ సినిమా హిట్టయ్యిందంటే ఇక కెరియర్‌ ఎక్కడికో వెళ్ళినట్లే. వెనువెంటనే బన్నీ - ఎన్టీఆర్‌ సినిమాలు కూడా హిట్టయ్యాయ్‌ అంటే.. ఇక రచ్చ రచ్చే.