Begin typing your search above and press return to search.

కూల్ గా శాండల్ ఉడ్ పై కన్నేసిందా?

By:  Tupaki Desk   |   25 April 2018 11:30 PM GMT
కూల్ గా శాండల్ ఉడ్ పై కన్నేసిందా?
X
తెలుగులో టాప్ హీరోయిన్ రేసులోకి రయ్యిమంటూ దూసుకొచ్చిన భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు బాగా నెమ్మదించింది. భారీ ప్రాజెక్టుల విషయంలో ఈమె పేరు అసలు వినిపించడం లేదు. రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా పరిశీలిస్తున్నట్లుగా కూడా వార్తలు రావడం లేదు.

ఈ సిట్యుయేషన్ కారణాలపై అన్వేషించిన రకుల్.. ఇప్పటికే ఓ డెసిషన్ కు వచ్చేసిందట. మళ్లీ తనకు టాలీవుడ్ లో పూర్వ వైభవం రావడానికి కొంత సమయం అవసరం పడుతుందనే విషయాన్ని గ్రహించిందట. ఈ లోగా తను ఖాళీగా ఉండడం.. చిన్నాచితకా సినిమాలతో సరిపుచ్చుకోవడం వంటివి చేయడం కష్టం. స్టార్ హీరోయిన్ స్థాయికి ఒక్క అడుగు దూరం వెళ్లి వెనక్కొచ్చిన తర్వాత.. మరీ లో బడ్జెట్ మూవీస్ లో కనిపిస్తే.. ఉన్న కాసింత పేరు కూడా పోతుంది. అందుకే.. ఇప్పుడు కన్నడ సినిమా ఇండస్ట్రీపై కన్నేసిందట ఈ బ్యూటీ. ఇప్పటికే తన మేనేజర్ కు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది.

కన్నడ నిర్మాతలతో టచ్ లో ఉండమని.. అక్కడి భారీ సినిమాల విషయంలో తన పేరును ప్రపోజల్స్ లోకి తీసుకురావాలని.. మిగతా విషయాలు తాను చూసుకుంటానని చెబుతోందట రకుల్ ప్రీత్ సింగ్. మొత్తానికి టాలీవుడ్ లో వచ్చిన గ్యాప్ ని శాండల్ వుడ్ లో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఫిల్ చేయాలన్న రకుల్ ఐడియాను ప్రశంసించాల్సిందే.