Begin typing your search above and press return to search.

రకుల్ బెంజ్ కొనేసింది చూశారా!!

By:  Tupaki Desk   |   25 Sep 2017 8:03 AM GMT
రకుల్ బెంజ్ కొనేసింది చూశారా!!
X
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ఎప్పుడైతే సక్సెస్ అయ్యిందో అప్పటి నుంచి రకూల్ ప్రీత్ సింగ్ స్పీడ్ మాములుగా లేదు. మెల్ల మెల్లగా కుర్ర హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోలతో స్క్రిన్ షేర్ చేసుకునే వరకు వచ్చింది. ప్రస్తుతం టాలీవుడ్ లో అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇక కొన్ని తమిళ్ సినిమాలు కూడా చేస్తూ.. అక్కడి ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా సినిమాలను చేస్తోంది.

ఇక అసలు విషయానికి వస్తే రకుల్ ప్రస్తుతం సౌత్ హీరోయిన్స్ లలో భారీ రెమ్యునరేషన్ ను అందుకుంటోంది. దసరా పండగ సందర్భంగా అమ్మడు అత్యంత ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ SUV కారును కొనుగోలు చేసింది. ఆ విషయాన్ని అమ్మడు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. రకుల్ కి కార్లంటే చాలా ఇష్టం. ఇంతకుముందు కూడా అమ్మడు రెండు ఖరీదైన కార్లను కొనుగోలు చేసింది. బిఎమ్ డబ్ల్యూ మరియ ఆడి కార్లు ఆల్ రెడీ ఉన్నాయి. అంతే కాకుండా తెలుగులో అవకాశాలు ఎక్కువగా వస్తుండడంతో హైదరాబాద్ సెకండ్ హోమ్ అనేసింది. రీసెంట్ గా ఒక విల్లాను కూడా కొనుగోలు చేసింది.

సొంత ఊరు ఢిల్లీ అయినా రకుల్ ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటోంది. అమ్మడు తమిళ్ లో ప్రస్తుతం కార్తీ తో ఖాకి అనే సినిమాతో బిజీగా వుంది. ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన స్పైడర్ సినిమా ఈ నెల 27న తెలుగు తమిళ్ లో ఒకేసారి రిలీజ్ అవుతోంది.