మిలిటరీ క్యాంపులో రకుల్

Sun Jan 14 2018 11:13:27 GMT+0530 (IST)

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ఎంట్రీ కోసం చాలా ఉత్సాహంగా ఉంది. తను నటించిన మొదటి సినిమా అయ్యారి విడుదలకు సిద్ధంగా ఉంది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఇది జనవరి 26 విడుదల చేయాలనీ ప్లాన్ చేసి ఆ మేరకు ప్రమోషన్ కూడా చేశారు. కాని అనుకోకుండా సెన్సార్ క్లియరెన్స్ తీసుకుని సంజయ్ లీలా భన్సాలీ పద్మావత్ రేస్ లోకి రావడంతో దీనికి తప్పుకోవడం తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు. పైగా అక్షయ్ కుమార్ ప్యాడ్ మ్యాన్ కూడా పోటీలో ఉండటంతో క్రేజ్ పరంగా తమదే వీక్ అని ఫీల్ అయిన అయ్యారి యూనిట్ ఫిబ్రవరి 9కి తమ డేట్ ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. సరే ఎలాగూ టైం దొరికింది కదా యూనిట్ మొత్తం ప్రమోషన్ వేగాన్ని ఇంకాస్త పెంచింది.ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ రాజస్తాన్ లోని జైసల్మేర్ లో ఉంది. హీరోలు సిద్దార్థ్ మల్హోత్రా మనోజ్ బాజ్ పాయ్ లతో హీరొయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పూజా చోప్రా కూడా ఇందులో ఉన్నారు. అక్కడ ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సుని కలుసుకుని వాళ్ళతో ఈ సినిమా గురించి చర్చిస్తూ వాళ్ల సాధకబాధలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా. అయ్యారి సినిమా ఇద్దరు సైనికాధికారుల మధ్య తలెత్తిన ఈగోలను బేస్ చేసుకుని తీసిన మూవీ. అభియాన్ సింగ్ జై బక్సీ అనే ఇద్దరు ఆఫీసర్ల నిజ జీవిత కథే ఆయ్యారికి స్ఫూర్తి.

నీరజ్ పాండే దీనికి దర్శకులు. ఈ మధ్య వచ్చిన సూర్య గ్యాంగ్ ఒరిజినల్ హింది మూవీ స్పెషల్ చబ్బీస్ దర్శకుడు ఇతనే. ఏ వెడ్నెస్డే బేబీ ధోని లాంటి కల్ట్ మూవీస్ తీసిన దర్శకుడు ఈయన. అందుకే ఆయ్యారి మీద భారీ అంచనాలు ఉన్నాయి. చాలా రియలిస్టిక్ గా సినిమాలు తీస్తాడనే పేరున్న నీరజ్ పాండే ద్వారా తన లాంచ్ జరగడం పట్ల రకుల్ బాగా హ్యాపీగా ఉంది. ఇది కనక హిట్ అయ్యి తనకు పేరు వస్తే ఇక చెప్పేదేముంది. అందుకే ప్రమోషన్ కోసం వంట చేయడానికి కూడా రెడీ అయిపోయి ఇలా టీంతో స్టిల్స్ ఇస్తోంది.