Begin typing your search above and press return to search.

రకుల్‌ ప్రీత్ అస్సలు ఊహించలేదట

By:  Tupaki Desk   |   10 Oct 2015 11:30 AM GMT
రకుల్‌ ప్రీత్ అస్సలు ఊహించలేదట
X
ఈరోజు బర్త్ డే జరుపుకుంటున్న బర్త్ డే బాబుల్లో రాజమౌళి ఒకరైతే.. హాట్‌ బ్యూటీల్లో బుజ్జిగాడు బేబి సంజన.. అలాగే ప్రస్తుత స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఉంది. బ్రూస్‌ లీ సినిమా రిలీజ్‌ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న రకుల్‌.. అసలు ఈ రేంజులో తన బర్త్ డే ను జరుపుకుంటుందని అస్సలు ఊహించలేదట. ఇంతకీ ఏం జరుగుతోంది అసలు?

అబ్బే ఏం లేదు.. రకుల్‌ ప్రీత్‌ పుట్టినరోజు అని తెలియగానే.. అస్సలు మీడియా సంస్థల నుండి.. విమర్శకుల వరకు.. సాటి స్టార్‌ హీరోయిన్ల నుండి దర్శకులు - రైటర్లు - నిర్మాతలు వరకు.. అందరూ సోషల్ నెట్‌ వర్కులో అమ్మడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఉన్నారు. సమంత, తాప్సీ, తమన్నా వంటి భామలందరూ అమ్మడికి విషెస్‌ చెప్పేశారు. మొన్నటివరకు కాస్త స్ర్టగ్లింగ్‌ లో ఉందిలే అనుకున్న రకుల్‌.. ఒక్కసారిగా ఇలా అందరికీ హాట్‌ ఫేవరేట్‌ గా మారిపోయింది. ఇదంతా చూస్తుంటే ఇంకా నమ్మలేకపోతున్నా అంటోందీ అమ్మడు.

అయితే ఇప్పటివరకు ఈరోజు ఒక్క కేక్‌ కూడా కట్ చేయలేదట. ఎంతసేపూ అమ్మడు బ్రూస్‌ లీ సినిమా ప్రమోషన్ల మీదనే ఫోకస్‌ చేస్తోందట. ఆ సినిమా రిలీజ్‌ అవ్వాలి.. హిట్ కొట్టాలి అంటోంది. ఇప్పటికే ఈమె హాట్‌ లుక్‌ ను హై డెఫినిషన్‌ లో కూడా రిలీజ్‌ చేయడంతో ఒక రేంజులో పేరొచ్చేసింది. ఇక బ్రూస్‌ లీ సినిమాలో సీన్లలో కూడా ఇరగదీస్తే.. ఓ పెద్ద స్టారవ్వడం ఖాయం. ఎనీవే.. హ్యాపీ బర్త్ డే రకుల్‌!!