Begin typing your search above and press return to search.

రకుల్.. కొట్టిందిగా ఇంకో ఛాన్స్

By:  Tupaki Desk   |   19 Feb 2017 9:30 AM GMT
రకుల్.. కొట్టిందిగా ఇంకో ఛాన్స్
X
ప్రస్తుతం టాలీవుడ్ కు రకుల్ ప్రీత్ సింగ్ ను మకుటం లేని మహారాణిగా చెప్పొచ్చు. మహేష్ బాబుతో పాటు చాలామంది స్టార్ హీరోలతో పని చేస్తోంది రకుల్ ప్రీత్. మరోవైపు తమిళం నుంచి కూడా ఆమెకు ఒకదాని తర్వాత ఒకటి ఆఫర్లు వస్తున్నాయి. ఆల్రెడీ కార్తి హీరోగా ‘తీరం అధికారం ఒండ్రు’ అనే సినిమాలో నటిస్తోంది రకుల్. ఇప్పుడు కార్తి అన్నయ్య సూర్యతో జోడీ కట్టే ఛాన్స్ కూడా కొట్టేసింది.

ఇటీవలే ‘ఎస్-3’తో పలకరించిన సూర్య.. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘స్పెషల్ చబ్బీస్’ రీమేక్ లో నటిస్తున్నాడు. అదయ్యాక విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి కమిటయ్యాడు సూర్య. ఆ చిత్రానికి రకుల్ ను కథానాయికగా ఎంచుకున్నారు. హీరోయిన్ల ఎంపికలో సెల్వ రాఘవన్ స్టయిలే వేరుగా ఉంటుంది. అతడి సినిమాల్లో కథానాయికల పాత్రలు కూడా చాలా భిన్నంగా.. బలంగా ఉంటాయి. కాబట్టి రకుల్ కు ఇది మంచి ఛాన్సే అనుకోవాలి.

ప్రస్తుతం తెలుగులో రకుల్ నటించిన ‘విన్నర్’ విడుదలకు సిద్ధమవుతోంది. మహేష్ బాబు సరసన చేస్తున్న సినిమా తుది దశకు వచ్చింది. నాగచైతన్యతో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇవి కాక ఇంకో రెండు మూడు సినిమాలు రకుల్ చేతిలో ఉన్నాయి. ఇప్పుడున్న అవకాశాలతో 2018 చివరి వరకు ఆమె డైరీ ఖాళీనే లేదసలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/