Begin typing your search above and press return to search.

నిన్నే పెళ్లాడతా అంటున్నరకుల్ తమ్ముడు

By:  Tupaki Desk   |   19 July 2019 10:12 AM GMT
నిన్నే పెళ్లాడతా అంటున్నరకుల్ తమ్ముడు
X
టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం చాలా సాధారణమైన విషయమే. జస్ట్ స్టార్ హీరోలు.. ప్రొడ్యూసర్ల ఫ్యామిలీల నుండి మాత్రమే కాకుండా ఇప్పుడు హీరోయిన్ల బ్రదర్లు కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ తాజాగా హీరోగా టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అమన్ హీరోగా నటిస్తున్న చిత్రం ఫిబ్రవరిలో లాంచ్ అయింది. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగోను కింగ్ అక్కినేని నాగార్జున విడుదల చేశారు.

ఈ సినిమాకు 'నిన్నే పెళ్లాడతా' అనే టైటిల్ ను లాక్ చేయడం విశేషం. నాగార్జున-టబు-కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన క్లాసిక్ 'నిన్నే పెళ్లాడతా' టైటిల్ ను ఇలా డెబ్యూ హీరో వాడుకోవడం.. ఆ సినిమా ఫస్ట్ లుక్ ను స్వయంగా నాగ్ విడుదల చేయడం గొప్ప విషయమే. స్టార్ హీరోల క్లాసిక్ సినిమాల టైటిల్స్ ఎవరైనా వాడుకుంటే అభిమానులు అప్సెట్ అవుతారు.. ఈ టైటిల్ విషయంలో అలాంటిది జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ టైటిల్ లోగోను నాగ్ రిలీజ్ చేశారంటే టైటిల్ విషయంలో ఆయన మద్దతు ఉన్నట్టే. ఇక ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయగలరు? ఇదిలా ఉంటే ఈ ఫస్ట్ లుక్ లాంచ్ విషయం తెలుపుతూ రకుల్ తన ఇన్స్టా ఖాతా ద్వారా నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపింది.

టైటిల్ లోగో పోస్టర్ లో యాక్షన్ మోడ్ లో చేతికి కట్టుతో ఉన్న హీరో.. హీరోయిన్ ను తీసుకుని వెళ్తున్నాడు. ఈ సినిమాలో అమన్ సరసన మోనిక హీరోయిన్ గా నటిస్తోంది. వైకుంఠ బోను ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాను అంబిక ఆర్ట్స్.. ఈశ్వరి ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.