Begin typing your search above and press return to search.

ఆ లిప్‌ లాక్‌ పై ఫ్యాన్స్ రుస‌రుస‌

By:  Tupaki Desk   |   14 Aug 2018 4:47 AM GMT
ఆ లిప్‌ లాక్‌ పై ఫ్యాన్స్ రుస‌రుస‌
X
విజ‌య్ దేవ‌ర‌కొండ‌- ర‌శ్మిక మంద‌న జంట‌గా న‌టించిన `గీతగోవిందం` ఆగ‌స్టు 15న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా రిలీజ్ ముందు ఈ సినిమా లీక్డ్ ఫుటేజ్ ఆన్‌ లైన్‌ లో సంద‌డి చేసి ప్ర‌కంప‌నాలు సృష్టించింది. ఇందులో దేవ‌ర‌కొంద‌- ర‌శ్మిక ఆన్‌ స్క్రీన్ రొమాన్స్ లీకైంది. ఓ ర‌న్నింగ్ బ‌స్‌ లో రేతిరేళ ప్ర‌యాణీకులంతా నిదురిస్తుండ‌గా, విండో క‌ర్టెయిన్ మూసివేసి.. అటుపై దేవ‌ర‌కొండ ల్యాప్‌ పై కూచుని అత‌డితో లిప్ లాక్ వేస్తుంది ర‌శ్మిక‌. జ‌నం చూస్తారేమోనంటూ దేవ‌ర‌కొండ వారిస్తున్నా ర‌శ్మిక డేరింగ్ యాక్ట్ ఆ క్లిప్ చూసేవాళ్ల గుండెల్లో గుబులు రేకెత్తించింది. గీత గోవిందం చిత్రంలో వేడెక్కించే ఇలాంటి రొమాన్స్‌కి కొద‌వేం లేద‌ని ఈ క్లిప్ ప్రూవ్ చేసింది. ఆ క్ర‌మంలోనే ఈ క్లిప్‌ పై యూత్‌ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. కొంద‌రైతే ఈ క్లిప్ ఎక్క‌డైనా ఆన్‌ లైన్‌ లో క‌నిపిస్తుంద‌ని వెతుకుతున్నా.. కాపీ రైట్ యాక్ట్ వ‌ల్ల ఆ క్లిప్‌ ని ప‌బ్లిష్ చేసిన వెబ్‌ సైట్లు తొల‌గించాయి.

`గీత గోవిందం` లీకేజీపై ఓవైపు స‌మ‌ర్ప‌కుడు అల్లు అర‌వింద్ ఓ రేంజులో ఫైర‌వుతూనే ఉన్నారు. మొన్న వైజాగ్‌ లో - నిన్న హైద‌రాబాద్‌ లో ఓ ప్రెస్‌మీట్‌లో నిప్పులు చెరిగారాయ‌న‌. ఇలా పైర‌సీ చేసి లీక్ చేస్తే దేవ‌ర‌కొండ ఫ్యాన్స్ చేతిలో త‌న్నులు తినేస్తారు జాగ్ర‌త్త‌! అంటూ హెచ్చ‌రించారు. ఈ లీకేజీ స‌రికాద‌ని టెక్నాల‌జీ అప్‌ డేట్ అయ్యాక‌ - ప్ర‌తి ఐపీని క్యాచ్ చేసి సైబ‌ర్ క్రైమ్ వాళ్లు తాట తీస్తున్నార‌ని మ‌రోమారు వివ‌ర‌ణ ఇచ్చారు.

ఇదంతా ఒక కోణం అనుకుంటే.. ఇప్పుడు ఈ ఒక్క లిప్‌ లాక్ క్లిప్ వ‌ల్ల ర‌శ్మిక మంద‌న‌కు వేరొక చిక్కు వ‌చ్చిప‌డింది. గ‌త కొంత‌కాలంగా ర‌శ్మిక క‌న్న‌డ ఫ్యాన్స్ త‌న‌పై గుర్రుమీదున్నారు. ఓవైపు హీరో కం ద‌ర్శ‌క‌నిర్మాత ర‌క్షిత్ శెట్టిని పెళ్లాడేందుకు సిద్ధ‌మ‌వుతూనే ఇలా ఇత‌ర హీరోల‌తో ఘాటైన రొమాన్స్ చేస్తావా? అంటూ సామాజిక మాధ్య‌మాల్లో అభిమానులు కోటింగ్ ఇస్తున్నారు. పూర్ ల‌వ‌ర్ ర‌క్షిత్ శెట్టి అంటూ ర‌శ్మిక మంద‌నపై సూటిపోటి మాట‌లు విసిరేస్తున్నారు. పూర్‌ ఫెలో అంటూ ర‌క్షిత్‌ శెట్టిని ఉడికిస్తున్నారు. అస‌లు టాలీవుడ్‌ కి ఎందుకెళ్లావ్‌? అంటూ కొంద‌రు అభిమానులు తిట్టేస్తున్నారు. మొత్తానికి ర‌శ్మిక‌కు స‌మాధానం చెప్ప‌లేక ఎర‌క్క‌పోయి ఇరుక్కుపోయిన‌ట్ట‌యింది. అయితే ఈ లిప్ లాక్ వీడియో `గీత గోవిందం` క‌న్న‌డ ప్ర‌చారానికి బాగా వ‌ర్క‌వుటైంద‌ని చెప్పొచ్చు. అంటే గీత‌గోవిందం క‌న్న‌డ వెర్ష‌న్ బ్లాక్‌ బ‌స్ట‌రేన‌న్న‌మాట‌!