రెజ్లర్ ను ఛాలెంజ్ - ఎత్తి పడేస్తే హాస్పిటల్ లో..

Tue Nov 13 2018 20:23:14 GMT+0530 (IST)

రాఖీ సావంత్ పబ్లిసిటీ దక్కించుకునేందుకు ఎంత దూరం అయినా వెళ్తుంది - ఎలాంటి వ్యాఖ్యలు అయినా చేస్తుంది ఎలాంటి ఫొటోలు అయినా పోస్ట్ చేస్తుంది అనే విషయం గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. ఇప్పుడు తాజాగా మరోసారి కూడా ఆ విషయాన్ని ఆమె నిరూపించింది. మీడియాలో ఫోకస్ కావాలనే ఉద్దేశ్యంతో తాజాగా ఒక రెజ్లర్ ను రింగ్ లో ఛాలెంజ్ చేసింది. ఛాంపియన్ అయిన తనీయాను రింగ్ లో రాఖీ సావంత్ రెచ్చగొట్టింది. చాలా సమయం ఓపిక పట్టిన తనీయా చివరకు ఓపిక నశించడంతో ఎక్కసారి ఎత్తి కుదేశింది. దాంతో రాఖీ మళ్లీ లేవలేక పోయింది.ముగ్గురు మనుషులు పట్టుకుని రాఖీ సావంత్ ను హాస్పిటల్ కు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. హాస్పిటల్ లో చేరిన తర్వాత కూడా రాఖీ సావంత్ ఆగడం లేదు. హాస్పిటల్ నుండే సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తోంది. నన్ను తనూశ్రీ దత్తా కొట్టించిందని - తనూశ్రీ దత్తాకు - తనీయాకు స్నేహం ఉంది. ఆ స్నేహంతోనే నన్ను ఇలా కొట్టించిందంటూ సోషల్ మీడియ ద్వారా ఆరోపించింది. అయితే రాఖీ సావంత్ ఆరోపణలను తనీయా కొట్టి పారేసింది. తాను ఎవరో ప్రభావితం చేస్తే రాఖీని కొట్టలేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

తనీయా సోషల్ మీడియా ద్వారా ఈ విషయమై స్పందిస్తూ... రాఖీ హాస్పిటల్ లో చేరడం బాధగా ఉంది. అయితే ఆమె ఓవర్ యాక్షన్ ను నేను తట్టుకోలేక పోయాను. పబ్లిసిటీ కోసం ఆమె చేసిన ప్రయత్నం నాకు నచ్చలేదు. నన్ను పదే పదే టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆమెను కొట్టవల్సి వచ్చిందని పేర్కొంది.

రాఖీ సావంత్ కు ఇలాంటివి కొత్తేం కాదు. పబ్లిసిటీ కి పోయి ఇలాంటి సంఘటల్లో ఇబ్బందులను ఎదుర్కోవడం ఆమెకు చాలా కామన్ అయ్యింది. ఇంత జరిగినా కూడా రాఖీ సావంత్ మళ్లీ పబ్లిసిటీ కోసమే ప్రయత్నం చేయకుండా మానదు. ఈమద్య తనూశ్రీ దత్తా వ్యవహారంలో రాఖీ సావంత్ ఏ స్థాయిలో ఆరోపణలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.