Begin typing your search above and press return to search.

ఫ్లైట్ టాయిలెట్ లో రాఖీ హ‌డావుడి!

By:  Tupaki Desk   |   15 Aug 2018 6:01 AM GMT
ఫ్లైట్ టాయిలెట్ లో రాఖీ హ‌డావుడి!
X
త‌న తీరుతో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే బాలీవుడ్ న‌టి రాఖీ సావంత్ మ‌రోసారి చెల‌రేగిపోయారు. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో త‌ర‌చూ వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచే ఆమె.. తాజాగా విమానంలో ఆమె చేసిన ప‌నిని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. డ్రామీ క్వీన్ గా ప‌లువురు అభివ‌ర్ణించే రాఖీ.. తాజాగా త‌న స్నేహితులు.. తెలిసిన వారితో క‌లిసి విమానంలో ప్ర‌యాణిస్తూ తాను చేసిన పనుల వీడియోను ట్వీట్ చేశారు.

ఫ్లైట్ లో ఉన్న ఎయిర్ హోస్టెస్ ను డ్యాన్స్ చేసేందుకు అనుమ‌తించాల‌ని కోరారు. ఇందుకు ఆమె నో చెప్పేయ‌టంతో బాత్రూంకు వెళ్లి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా షేర్చేశారు. ఫ్లైట్ టాయిలెట్ తో డ్యాన్స్ చేసి దాన్నే కికి ఛాలెంజ్ గా ఆమె అభివ‌ర్ణించ‌టం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. త‌న చేష్ట‌ల‌తో ప్ర‌చారం పొంద‌టానికి రాఖీ చేసిన ఈ ప్ర‌య‌త్నంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.