Begin typing your search above and press return to search.

మాకు సల్మాన్ 5 కోట్లు ఇచ్చి తీరాలి

By:  Tupaki Desk   |   23 Jun 2018 1:30 AM GMT
మాకు సల్మాన్ 5 కోట్లు ఇచ్చి తీరాలి
X
బాలీవుడ్ మాస్ హీరో సల్మాన్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద వీరవిహారం చేస్తున్నాడు. సల్లూ భాయ్ లేటెస్ట్ మూవీ రేస్-3 విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లు వసూలు చేసింది. మొదటి వారం గడిచేసరికి కలెక్షన్లు రూ. 150 కోట్ల దాకా ఉంటాయని అంచనాలున్నాయి. రేస్-3 మూవీ పరమ చెత్తగా ఉందని రివ్యూలొచ్చాయి. సినిమా అస్సలు బాలేదని మౌత్ టాక్ కూడా ఉంది. కానీ కలెక్ష్లన్లు మాత్రం అదిరిపోతున్నాయి.

రేస్-3 బ్రహ్మాండమైన కలెక్షన్లు రాబట్టింది కాబట్టి తమకు చెరో రూ. 5 కోట్లు ఇవ్వాలని బాలీవుడ్ సెక్సీ బ్యూటీలు రాఖీ సావంత్.. అర్షీ ఖాన్ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ అవార్డు ఫంక్షన్ కు వచ్చిన వీళ్లిద్దరినీ రేస్-3 గురించి స్పందించమంటే ఈ డిమాండ్ వినిపించారు. రేస్-3 సినిమాను తప్పకుండా చూడాలంటూ ప్రేక్షకులను తాము మరీమరీ కోరామని.. అంత గొప్పగా ప్రమోట్ చేసినందుకు తమకు డబ్బులివ్వాలంటూ ఫన్నీగా చెప్పుకొచ్చారు. రాఖీ సావంత్ అయితే... ‘‘పోయేటప్పుడు డబ్బులేమన్నా పట్టుకుపోతారా? బ్యాంకులో దాచుకున్న డబ్బులు బయటకు తీసి వెళ్లి రేస్-3 చూడాలంటూ’’ సినిమా రిలీజ్ కు ముందు చెప్పిన మాటలను ప్రత్యేకంగా గుర్తు చేసింది.

రాఖీ ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ను హాలీవుడ్ కండల వీరుడు సిల్వెస్టర్ స్టాలోన్ తో పోల్చేసింది. ‘‘జనాలు సినిమా ఇంకా సినిమాలు చూస్తున్నారు అంటే దానికి ఒకే ఒక్క కారణం సల్మాన్ ఖాన్. అతడొక్కడే.. ఇంకెవరూ కాదు’’ అంటూ సల్మాన్ ను ఆకాశానికెత్తేసింది. ఈ రేంజిలో పొగిడినందుకు అయినా ఈ భామలకు సల్లూ భాయ్ ఎంతో కొంత ఇచ్చే తీరాలి.. ఏమంటారు?