Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: నాగ్ గదిలోకి వచ్చేసిండు

By:  Tupaki Desk   |   20 Sep 2017 5:23 AM GMT
ట్రైలర్ టాక్: నాగ్ గదిలోకి వచ్చేసిండు
X




''రాజు గారి గది 2'' అంటూ ఇప్పుడు కింగ్ నాగార్జున వస్తున్నాడు. గతంలో ఓంకార్ డైరక్షన్లో వచ్చిన రాజు గారి గది సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో నాగ్ మెయిన్ లీడ్ అయితే.. సమంత అండ్ సీరత్ కపూర్ కూడా నటిస్తున్నారు. ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.

బీచ్ సైడ్ ఉండే ఒక ఇంటిని పట్టి వేధిస్తుంటుంది ఒక అమ్మాయి ఆత్మ. ఆ ఆత్మ ఎవరిదో కాదు.. డైరక్టుగా చూపించకపోయినా కూడా అది సమంతే నని అందరికీ తెలుసు. ఇకపోతే ఈ సినిమాలో సీరత్ కపూర్ మాత్రం భారీగా అందాలను ఆరబోసినట్లు ఉంది. ఒక షాట్లో ఆమెను బ్యాక్ నుండి బికినీలో చూపించేసి ఓంకార్ మార్కులు వేయించుకున్నాడు. ఇకపోతే సినిమాలో బికినీలో సీరత్.. దెయ్యంగా సమంత.. మెంటలిస్ట్ గా నాగార్జున.. భయపడే కమెడియన్లు వెన్నెల కిషోర్. షకలక శంకర్.. వీరు తప్పించి.. కథ మాత్రం ఇప్పటికైతే రొటీన్ గానే ఉంది. సినిమా రిలీజయ్యాక పార్టు 1లో ఇచ్చినట్లు ఓంకార్ ఏదన్నా టిస్ట్ ఇస్తాడేమో చూడాలి.

ఇకపోతే ఈ ట్రైలర్ వరకు థమన్ మ్యూజిక్ మాత్రం కేక పెట్టించాడు. అసలే మనోడు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వాయించడంలో చాలా దిట్ట. అందుకే ఇరగదీశాడు కూడా. అక్టోబర్ 13న ఈ సినిమాతో మరోసారి తానేంటో ప్రూవ్ చేస్తానంటూ ప్రెస్ మీట్లో ఓంకార్ కూడా చెప్పేశాడు. అది సంగతి.