Begin typing your search above and press return to search.

టీజర్ టాక్ : ఈ జబ్బు భలే ఉందే

By:  Tupaki Desk   |   18 March 2018 5:25 AM GMT
టీజర్ టాక్ : ఈ జబ్బు భలే ఉందే
X
సంక్రాంతికి రంగుల రాట్నం రూపంలో పెద్ద షాకే తిన్న రాజ్ తరుణ్ కొత్త సినిమా రాజుగాడు విడుదలకు సిద్ధమవుతోంది. మే 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ టీజర్ ను విడుదల చేసిన యూనిట్ కథ దేని గురించో ఉన్న నలభై సెకండ్లలోనే చెప్పేసింది. ఈ మధ్యకాలంలో హీరోకు ఏదో ఒక బలహీనత లేక లోపం ఉండటం యునీక్ పాయింట్ గా ఉంటోంది. ఇందులో కూడా దర్శకురాలు సంజనా రెడ్డి రాజ్ తరుణ్ కు కాస్త వెరైటీ రోల్ సెట్ చేసారు. అదేంటంటే హీరో తనకు తెలియకుండానే తన పక్కన ఉన్నవారి దగ్గర చుట్టూ ఉన్నవాటిలో సరదాగా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. కావాలని కాదు కాని ఆటోమేటిక్ గా అలా దొంగతనాలు జరిగిపోతూ ఉంటాయి. ఆఖరికి తను ప్రేమించిన అమ్మాయి పక్కన కూర్చుని మాట్లాడితే తనకు తెలియకుండా ఒంటి మీద గోల్డ్ మొత్తం ఒలుచుకుని వచ్చేస్తాడు.

లైన్ పరంగా ఇంటరెస్టింగ్ గానే అనిపిస్తున్న రాజుగాడు కంటెంట్ పరంగా కూడా ఎంటర్ టైనింగ్ గానే కనిపిస్తున్నాడు. నిన్ను కోరి ఫేం గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో రాజ్ తరుణ్ సరసన హీరొయిన్ గా అమైరా దస్తూర్ నటిస్తోంది. ఇటీవలే మంజుల దర్శకత్వంలో వచ్చిన మనసుకు నచ్చింది ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన అమైరా తన రెండో సినిమా కూడా మహిళా దర్శకురాలితో చేయటం విశేషం. రాజేంద్ర ప్రసాద్, సితార రాజ్ తరుణ్ కు తల్లితండ్రులుగా నటిస్తున్నారు. మొత్తం సెట్ అప్ మరీ కొత్తగా కాకపోయినా హీరోకున్న వింత వ్యాధి చుట్టే కథ మొత్తం అల్లినట్టు కనిపిస్తోంది.

రాజ్ తరుణ్ కు హిట్ చాలా అర్జెంటు గా కావాల్సిన తరుణంలో ఈ రాజుగాడు వస్తున్నాడు. గత ఏడాది కిట్టు ఉన్నాడు జాగ్రత్త - అంధగాడు తో ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయిన రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ రాజు గాడు మీద గట్టి ఆశలే పెట్టుకున్నాడు. మే 11 డేట్ ఫిక్స్ చేసారు ఆ టైంలో పోటీ భారీగానే ఉండబోతోంది. రెండు రోజుల ముందు మే 9న మహానటి డేట్ ఇవాళే ఫిక్స్ చేయగా సాయి శ్రీనివాస్ సాక్ష్యం కూడా రాజుగాడు వచ్చే రోజునే విడుదల అయ్యే అవకాశం ఉంది.


టీజర్ కోసం క్లిక్ చేయండి