Begin typing your search above and press return to search.

ముంబైలో మొదలెట్టేసిన సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   28 May 2017 5:43 PM GMT
ముంబైలో మొదలెట్టేసిన సూపర్ స్టార్
X
రోబో సీక్వెల్ 2.0 షూటింగ్ ను రజినీకాంత్ పూర్తి చేసేసినా.. ఆ మూవీ రిలీజ్ కు ఇంకా చాలానే టైం పట్టనుంది. వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ ఉంటుందనే టాక్ ఉంది కానీ.. అది కూడా అనుమానమే అంటున్నారు కొందరు. అయితే.. ఇప్పుడు రజినీ కొత్త సినిమాపై ఇప్పటికే ప్రకటన వచ్చేయడమే కాదు.. షూటింగ్ కూడా స్టార్ట్ చేసేయడం విశేషం.

కాలా అంటూ ముంబై అండర్ వరల్డ్ పై సూపర్ స్టార్ కొత్త సినిమా చేస్తున్నారు. రీసెంట్ గా ఇచ్చిన ఫస్ట్ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. రజినీకాంత్ గెటప్ ను చూసి.. ఫ్యాన్స్ తెగ సంతోషంలో మునిగిపోయారు. ఇప్పుడా మూవీ షూటింగ్ కూడా చేసేస్తుండడం విశేషం. ముంబై బ్యాక్ గ్రౌండ్ లో ఈ మూవీ కథ జరగనుండడంతో.. ఔట్ డోర్ కు సంబంధించిన షూటింగ్ అంతా అక్కడే చేయనున్నారు. లాంగ్ షెడ్యూల్ ను అక్కడ చేసిన తర్వాత.. మిగిలిన భాగాన్ని చెన్నైలో సెట్స్ వేసి పిక్చరైజ్ చేస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం ముంబైలో కాలా కరికులన్ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుండగా.. అక్కడి లోకల్ జూనియర్ ఆర్టిస్టులతో షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు పా రంజిత్. కబాలి తర్వాత మళ్లీ మాఫియా బ్యాక్ డ్రాప్ తోనే.. అది కూడా సౌతిండియా సూపర్ స్టార్ తో రంజిత్ ఈ మూవీ రూపొందిస్తున్నాడు. కాలా చిత్రానికి రజినీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాత కావడం విశేషం.