Begin typing your search above and press return to search.

రజని చేయకపోవడమే బెటర్

By:  Tupaki Desk   |   20 Jan 2019 4:45 AM GMT
రజని చేయకపోవడమే బెటర్
X
కొన్ని పాత్రలు అందరూ చేసేవి కావు. కొన్ని కథలు కొందరు నటుల కోసమే అన్నట్టు పుట్టుకొస్తాయి. కమర్షియల్ సినిమాలు ఏ మాస్ హీరోతో అయినా చేయొచ్చు కానీ ప్రత్యేకమైన జానర్ లో తీసే మూవీస్ కి మాత్రం వర్సటైల్ యాక్టర్స్ అవసరం. కోట్ల సంఖ్యలో అభిమానులు కొండంత ఇమేజ్ ఒక్కటే సరిపోదు. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా. ఇండియన్ 2 మొదలైన వేళ ఫస్ట్ పార్ట్ భారతీయుడు తాలూకు విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. శంకర్ అప్పటి టీమ్ మేట్ కం దర్శకుడు వసంత బాలన్ వాటిని గుర్తుచేసుకుని కొన్ని సర్ప్రైజింగ్ విషయాలు చెప్పాడు.

అందులో ముఖ్యమైనది భారతీయుడు మొదట రాసుకున్నది రజనీకాంత్ కోసమట. అయితే కాల్ షీట్స్ అందుబాటులో లేకపోవడంతో పాటు వృద్ధుడి పాత్ర కావడం వల్ల తలైవా కొంత ఆలోచనలో పడ్డాడు. దీంతో అది కమల్ కోర్ట్ కు వచ్చింది. అయితే ఒక దశలో తండ్రి పాత్రలో రాజశేఖర్-కొడుకుగా వెంకటేష్ లేదా నాగార్జునతో చేద్దామని శంకర్ ఆలోచించాడట. కానీ కుదరలేదు. సత్యరాజ్-కార్తిక్ ని ట్రయ్ చేద్దాం అనుకున్నారు. అదీ వర్క్ ఔట్ కాలేదు. చివరికి రెండు పాత్రలకు కమల్ హాసన్ సై అన్నాడు. నభూతో నభవిష్యత్ అనే రీతిలో అద్భుతంగా పండించాడు. ఫలితంగా బ్లాక్ బస్టర్ దక్కింది. స్టైల్ కి పర్యాయపదంలా నిలిచే రజని కనుక భారతీయుడు చేసుంటే ఇంత ఇంపాక్ట్ ఉండేది కాదని అధిక శాతం అంటున్న మాట. ఉదాహరణకు బాషాలో కమల్ ని సాగర సంగమంలో బాలకృష్ణని విచిత సోదరులులో నాగార్జునని ఊహించగలమా. ఇవి కేవలం కమల్ కు మాత్రమే సాధ్యమయ్యే యూనీక్ జానర్స్.

అందుకే రజిని మిస్ అవడమే మంచిదయిందని వసంత బాలన్ మాటల్ని ఉటంకిస్తూ కోలీవుడ్ లో కథనాలు వస్తున్నాయి. ఇందులో నిజం లేకపోలేదు.కమల్ కాకుండా భారతీయుడులో ఇంకెవరినైనా ఊహించుకోవడం కష్టం. అదే జెంటిల్ మెన్-ప్రేమికుడు ఎవరికైనా సూట్ అవుతాయి. కానీ ఇవి మాత్రం కమల్ కు కోసమే పుట్టినవి. అందుకే ఈ తరంలో ఒకే సినిమాలో 9 పాత్రలు వేసే సాహసం దశావతారం ద్వారా ఒక్క కమల్ మాత్రమే చేయగలిగాడు. ఇవన్నీ కాదు కాని గతంలో స్వయానా రజనినే ఓ స్టేజి మీద కమల్ లా చేయడం నా వల్ల కాదు అని పబ్లిక్ గా చెప్పేసాడు. ఇక ఇందులో వాదన ఏముంటుంది లోక నాయకుడి గొప్పదనాన్ని ఒప్పుకోవడం తప్ప