Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: మహాత్మా గాంధీతో రజనీకాంత్

By:  Tupaki Desk   |   3 Aug 2016 2:35 PM IST
ఫోటో స్టోరి: మహాత్మా గాంధీతో రజనీకాంత్
X
అభిమానుల పిచ్చిని క్రేజ్ అనుకుందాం అంటే.. ఈ క్రేజ్ మితిమీరిపోయినప్పుడు మాత్రం దీనిని పిచ్చి అనే అనాలి. అది హద్దులు దాటి బ్రేక్ డ్యాన్స్ ఏస్తే ఎలా ఉంటుందో తెలుసా? అదిగో ఆ ఫోటోను చూస్తున్నారుగా అచ్చం అలాగే ఉంటుంది. సూపర్ స్టార్ మీద ఉన్న అభిమానం సంగతి పక్కనెట్టేస్తే.. పక్కనే ఉన్న మహాత్ముడిని చూసైనా మనోళ్ళు కాస్త తగ్గాల్సింది. అబ్బే వింటేగా.

సూపర్ స్టార్ రజనీకాంత్‌ స్వయంగా మహాత్మా గాంధీతో మాట్లాడుతున్నట్లు ఇప్పుడు ఒక ఫోటోషాపింగ్ పిక్చర్ ఒకటి చెక్కర్లు కొడుతోంది. కెరియర్తొ లినాళ్ళలోని రజనీ పిక్చర్ ఒకటి తీసుకుని.. దానిని గాంధీజి ఫోటోకు తగిలించారు. 1948లో మరణించిన గాంధీగారి పక్కన.. 1950లో పుట్టిన రజనీకాంత్‌ ఫోటో ఎలా సెట్టవుతుంది అని ఆలోచించకుండా.. ఫ్రీడమ్ మూవ్మెంట్ లో పాల్గొన్న రజనీకాంత్ ను అభినందిస్తున్న గాంధీజి అంటూ దీనిని ఇప్పుడు సోషల్ మీడియాలో తిప్పుతున్నారు జనాలు.

రజనీ మీద ఎన్ని జోకులు వేసుకున్నా పర్లేదు కాని.. అందులోకి గాంధీ గారిని కూడా లాగేయడం అనేది కాస్త ఇబ్బందికరమే. వీటిని అభిమానులు ఆపేస్తే బెటర్.