Begin typing your search above and press return to search.

ఎట్ట‌కేల‌కు ర‌జినీకాంత్ మాట్లాడాడు

By:  Tupaki Desk   |   26 July 2016 1:48 PM GMT
ఎట్ట‌కేల‌కు ర‌జినీకాంత్ మాట్లాడాడు
X
సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ రెండు నెల‌లుగా ఇండియాలో లేడు. ఆయ‌న ఆరోగ్యం గురించి ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. మ‌రోవైపు ‘క‌బాలి’ ఆడియో వేడుక స‌హా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో ఎక్క‌డా ర‌జినీ క‌నిపించ‌లేదు. ఆ సినిమా గురించి ఒక స్టేట్ మెంట్ కూడా ఇవ్వ‌లేదు. ట్వీట్ కూడా పెట్ట‌లేదు. చివ‌రికి సినిమా విడుద‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న ఇక్క‌డ లేడు. దీంతో అభిమానులు చాలా అసంతృప్తికి లోన‌య్యారు. ఐతే ఎట్ట‌కేల‌కు రెండు రోజుల కింద‌టే అమెరికా నుంచి చెన్నై వ‌చ్చిన ఆయ‌న రాగానే.. ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. త‌న అమెరికా ప‌ర్య‌ట‌న గురించి స్పందించ‌డంతో పాటు.. క‌బాలి గురించి కూడా మాట్లాడారాయ‌న‌. స్వ‌యంగా త‌మిళంలో త‌న చేతిరాత‌తో ర‌జినీ ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేయ‌డం విశేషం.

ఇన్నేళ్లుగా న‌న్ను ఆద‌రిస్తున్న త‌మిళ ప్రజానీకానికి నా న‌మ‌స్కారాలు అంటూ మొద‌లుపెట్టిన ర‌జినీ.. తాను ఎందుకు రెండు నెల‌లు విశ్రాంతి తీసుకోవాల్సి వ‌చ్చిందో వివ‌రించారు. ‘‘వ‌రుస‌గా రెండు సినిమాలు.. శంక‌ర్ తో ‘2.0’కు.. పా.రంజిత్ తో ‘క‌బాలి’కి తీరిక లేకుండా ప‌ని చేయ‌డంతో విశ్రాంతి అవ‌స‌ర‌మైంది. రెండు నెల‌ల విరామం తీసుకుని నా కూతురు సౌంద‌ర్య‌తో క‌లిసి అమెరికాకు వెళ్లాను. అక్క‌డే నా ఆరోగ్యం చూసుకున్నాను. వైద్య చికిత్స తీసుకున్నాను. అమెరికాలో ‘క‌బాలి’కి అద్భుత‌మైన ఓపెనింగ్స్ వ‌చ్చాయి. స్వ‌యంగా చూశాను. త‌ర్వాత చెన్నైకి వ‌చ్చి ‘క‌బాలి’ సాధించిన విజ‌యాన్ని క‌ళ్లారా చూశాను. చాలా సంతోషం క‌లిగింది. ఈ సినిమాను నిర్మించిన నా లాంగ్ టైం ఫ్రెండ్ థానుకి.. ద‌ర్శ‌కుడు పా.రంజిత్ మిగ‌తా యూనిట్ స‌భ్యుల‌కు హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ‘క‌బాలి’కి ఇంత పెద్ద విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టిన ప్రేక్ష‌కులు.. నా అభిమానులు.. డిస్ట్రిబ్యూట‌ర్లు.. థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు కూడా నా కృత‌జ్న‌త‌లు’’ అని పేర్కొన్నాడు ర‌జినీ.