Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ: ర‌జ‌నీ స్టైల్ పీక్స్‌ లో!

By:  Tupaki Desk   |   13 Feb 2016 8:59 AM GMT
ఫొటో స్టోరీ: ర‌జ‌నీ స్టైల్ పీక్స్‌ లో!
X
స్టైల్ అంటే ర‌జ‌నీనే. యువ క‌థానాయ‌కులు ఎంత‌మంది వ‌చ్చినా స‌రే... ఇప్పటికీ ప్రేక్ష‌కులు ర‌జ‌నీ స్టైల్‌ నే ఇష్ట‌ప‌డుతుంటారు. ఆయ‌న తెర‌పై చేసే హంగామా అలా ఉంటుంది. అయితే ర‌జ‌నీ ఇప్ప‌టిదాకా తెర‌పై కనిపించింది ఒకెత్తు... మా సినిమాలో క‌నిపించేది మ‌రో ఎత్తు అంటోంది క‌బాలి టీమ్‌. రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా క‌బాలి తెర‌కెక్కుతోంది.

ఇందులో ర‌జ‌నీ ఓ మాఫియా డాన్‌ గా క‌నిపించ‌బోతున్నాడు. ఆ పాత్ర కోసం కొత్త గెట‌ప్‌ లోకి మారాడు రజ‌నీ. హెయిర్ స్టైల్‌ - గెడ్డంతో స‌రికొత్త‌గా క‌నిపిస్తున్నాడు. ఆ లుక్కే య‌మా స్టైలిష్‌ గా ఉందంటుంటే ఇప్పుడు దానికి తోడు టాటూస్‌ ని కూడా చేర్చారు. ర‌జ‌నీ త‌న చేతికి పెద్ద టాటూస్ వేయించుకొని మ‌రింత స్టైలిష్‌ గా మారిపోయాడు. ఆ స్టిల్స్‌లో ర‌జ‌నీకాంత్‌ ని చూస్తే ఇంకో ప‌దేళ్ల త‌ర్వాత కూడా కుర్రాళ్ల‌కి పోటీనిస్తా అన్న‌ట్టుగా క‌నిపిస్తున్నాడు. పోస్ట‌ర్ల‌లోనే ఇలా ఉందంటే ఇక తెర‌పై ఇంకెంత హంగామా ఉంటుందో ఊహించొచ్చు. ఇప్ప‌టిదాకా త‌న మేన‌రిజ‌మ్స్‌ తోనే స్టైల్‌ ని ప్ర‌ద‌ర్శించాడు ర‌జ‌నీ. క‌బాలి చిత్రంలో మేన‌రిజ‌మ్స్‌ కి తోడుగా గెట‌ప్పులు కూడా వ‌చ్చాయి. అందుకే ఈ సినిమాపై అభిమానులు మ‌రిన్ని అంచ‌నాలు పెంచుకొన్నారు.