Begin typing your search above and press return to search.

రజనీ తప్పుకున్నాడు.. బాహుబలి ఒక్కడే

By:  Tupaki Desk   |   25 Aug 2016 3:30 PM GMT
రజనీ తప్పుకున్నాడు.. బాహుబలి ఒక్కడే
X
మనోళ్లు ఈ మధ్యన సినిమాల రిలీజులు విషయంలో చాలా జాగ్రత్తగానే ఉంటున్నారు. సినిమా టు సినిమా సరిగ్గా వారం గ్యాపు మెయిన్టయిన్ చెయ్యకపోతే మాత్రం.. ఓపెనింగుల మీద భారీ దెబ్బపడుతోంది. అందుకే పెద్ద సినిమాలను ముందుగానే రిలీజ్ డేటు చెప్పేయమంటున్నారు.

మొన్నటివరకు ఉన్న సందేహాలు ఏంటంటే.. అసలు బాహుబలి: ది కంక్లూజన్ సినిమా ఎప్పుడు వస్తుంది.. అలాగే రజనీకాంత్ రోబో 2.0 ఎప్పుడు రిలీజవుతోంది.. ఈ రెండు సినిమాలూ 2017 సమ్మర్ లో వస్తే మరి మిగతా సినిమాల పరిస్థితేంటి అనే సందేహాలు ఉండేవి. కాని ఇప్పుడవన్నీపటాపంచలు అయిపోయాయ్. ఏప్రియల్ 28 - 2017న వస్తున్నట్లు ఆల్రెడీ బాహుబలి 2 టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఇదే సమ్మర్ లో రజనీ రావడం మాత్రం కష్టమేనట. అందుకే 2017 అక్టోబర్ లో దీపావళి పండుగనాడు శంకర్ తీస్తున్న 2.0 సినిమాను రిలీజ్ చేస్తామని కన్ఫామ్ చేశారు. ముఖ్యంగా గ్రాఫిక్స్ వర్కు కోసం ఆ మాత్రం టైమ్ పడుతోందట.

కాబట్టి కబాలి స్టార్ లైన్లో లేడు.. ఓన్లీ బాహుబలి 2 మాత్రమే పోటీకి దిగుతున్నాడు. ఇది దృష్టిలో ఉంచుకుని మిగిలిన రిలీజులన్నీ ఇప్పుడు ప్లాన్ చేసుకుంటారట. అది సంగతి.