'కాలా' కంటే 11రెట్లు ఎక్కువ?

Fri Nov 09 2018 11:55:57 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ సన్నివేశం టాలీవుడ్ మార్కెట్లో దిగదుడుపుగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమాలు గత కొంతకాలంగా తెలుగులో డిజాస్టర్ రిజల్ట్ తో మార్కెట్ వర్గాల్ని కలవరపాటుకు గురి చేయడమే అందుకు కారణం. రజనీ ఛరిష్మాకి - అతడిపై అభిమానానికి కొదవేం లేదు. కానీ ఎంచుకున్న స్క్రిప్టులు - అరవ నేటివిటీ మన జనాలకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆ క్రమంలోనే వరుస వైఫల్యాలు ఇబ్బంది పెట్టాయి. రజనీ నటించిన కబాలి - కాలా చిత్రాలు పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.ఆ క్రమంలోనే రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రం వాయిదాల ఫర్వంలో రిలీజ్ కి రావడంతో ఆ ప్రభావం రైట్స్ కొనుక్కున్న వాళ్లపైనా పడింది. అలా ఓసారి ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఏషియన్ సునీల్ నారంగ్ లైకా సంస్థ నుంచి తిరిగి అడ్వాన్సులు వెనక్కి తీసుకోవడంతో ఇటీవల ఆసక్తికర చర్చ సాగింది.  ఎన్.వి.ప్రసాద్ - యువిక్రియేషన్స్ వంశీ- దిల్ రాజు 2.ఓ తెలుగు రాష్ట్రాల హక్కుల్ని ఛేజిక్కించుకున్నారు. నైజాంలో దిల్ రాజు గుంటూరు- నెల్లూరు ఏరియాకి వంశీ - సీడెడ్-ఈస్ట్-వెస్ట్ లో ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాకి బిజినెస్ పరంగా పరిశీలిస్తే `కాలా`తో పోలిస్తే ఏకంగా 11రెట్లు అధిక మొత్తాన్ని లైకా సంస్థకు చెల్లించింది ఈ బృందం. దాదాపు 72కోట్ల మేర డీల్ కుదిరితే దానికి జీఎస్టీ - ఇతరత్రా పన్నులు కలుపుకుని 80కోట్లలో రైట్స్ ఛేజిక్కించుకున్నారని తెలుస్తోంది. కాలా సినిమా 7కోట్ల బిజినెస్ చేసింది. కానీ ఇపుడు తూగో జిల్లాకే 2.ఓ హక్కులు 5.5కోట్లు పలకడం ఆశ్చర్యపరుస్తోంది. కాలా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా 2.ఓ చిత్రానికి రజనీ-శంకర్ కాంబినేషన్ అంత హైప్ తేవడంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.