దర్బార్.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్

Mon Apr 15 2019 19:36:09 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త సినిమాను ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నాడనే సంగతి తెలిసిందే.  'దర్బార్' టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈమధ్యే రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్.. ఆ ఫస్ట్ లుక్ పై కాపీ ఆరోపణలు రావడం కూడా అంతా తెలుసు కదా.  అవన్నీ పక్కనపెడితే తాజాగా ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో రజనీకాంత్ డబల్ రోల్ లో కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.  పోలీస్ ఆఫీసర్ గా ఒక పాత్రలోనూ.. సోషల్ యాక్టివిస్ట్ గా మరో పాత్రలోనూ నటిస్తున్నాడట.  రజనీకాంత్ తండ్రి కొడుకులుగా డబల్ రోల్ లో ఆడియన్స్ ను మెప్పిస్తాడని సమాచారం. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో రజనీ ఇలా తండ్రి కొడుకులుగా నటించాడు కానీ ఎక్కువ శాతం సినిమాల్లో తండ్రి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో మాత్రమే వస్తుంది. మరి ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్ ఎలా ప్లాన్ చేశారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

'దర్బార్' సినిమాలో రజనీ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.  లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.  వచ్చే ఏడాది పొంగల్ సీజన్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.