Begin typing your search above and press return to search.

రజనీ సింప్లిసిటీకి మరో నిదర్శనం!

By:  Tupaki Desk   |   23 July 2016 10:08 AM GMT
రజనీ సింప్లిసిటీకి మరో నిదర్శనం!
X
రజనీకాంత్... ఈ పేరు ఇండియాలోనే కాదు - ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమా జనాలకు ఒక కిక్. తన వాకింగ్ స్టైల్ - యాక్టింగ్ స్టైల్... అలా విడివిడిగా చెప్పుకుంటే కష్టం కానీ.. రాజనీ అంటేనే ఒక స్టైల్! ఇండియాలో ముఖ్యంగా తమిళనాడులో రజనీకాంత్ అంటే ఒక వ్యక్తి కాదు.. శక్తే కాదు.. అంతకుమించినది ఏదో! రజనీ ఒక కంటి సైగ చాలు చాలా ప్రణాళికలు - వాటి తాలూకు పరిణామాలు మారిపోతుంటాయి. తెరపై రజనీ కనిపిస్తే చాలు పిచ్చెక్కి పోయే అభిమానులు, ఆయన పోస్టర్ కనిపిస్తే చాలు దండలేసి - బొట్లు పెట్టేసే వీరాభిమానులు ఎందరో!!

ఇలాంటి రజనీకాంత్ అమెరికా వెళ్లారు.. వెళితే అక్కడ ఎలా ఉంటారు.. ప్రపంచం మొత్తం ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరో దేశం కాని దేశంలో ఎంత సెక్యూరిటీ మధ్య తిరుగుతారు, ఏ స్థాయి జీవితం గడుపుతుంటారు? అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇస్తుంది ఒక వీడియో. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న ఈ వీడియో చూస్తే ఎవరికైనా రజనీ సింప్లిసిటీపై వేరే అనుమానాలు రావు!

అమెరికాలో రోడ్డు పక్కన హెడ్ ఫోన్స్ పెట్టుకుని - వాకింగ్ డ్రెస్ వేసుకుని తలదించుకుని సామాన్యుడిలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు రజనీకాంత్. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న ఒక కారులోని మహిళ రజనీని గుర్తుపట్టి పలకరించింది. అనంతరం తనదైన శిలిలో చిరునవ్వు నవ్విన రజనీ... ఆమెను చెయ్యి ఊపి పలకరించి తన నడకను కొనసాగించారు. ఈ వీడియో చూసిన తర్వాత రజనీ ని రజనీ సర్ అనపొతే మనసు అంగీకరించదు కదా! రజనీ సర్ యు ఆర్ గ్రేట్!!