Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సూపర్ లుక్ లీక్ అయింది!!

By:  Tupaki Desk   |   27 Aug 2016 4:34 PM GMT
సూపర్ స్టార్ సూపర్ లుక్ లీక్ అయింది!!
X

సౌతిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి రిజల్ట్ ని బాగానే తీసుకోగలిగారు. సక్సెస్ విషయంలో తెలుగు వెర్షన్ ఫెయిల్ అయినా.. తమిళ్ వెర్షన్ మాత్రం విజయవంతమైందనే చెప్పాలి. కాన్సెప్ట్ బేస్డ్ గా తీసినా.. రజినీ మెరిపించిన సీన్స్ అక్కడక్కడా మాత్రమే ఉన్నా.. తమిళ్ కబాలికి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కబాలి రిలీజ్ తర్వాత దాదాపు నెల రోజులకు పైగా బ్రేక్ తీసుకున్న రజినీకాంత్.. సెప్టెంబర్ ప్రారంభం నుంచి రోబో సీక్వెల్ పనులు కంటిన్యూ చేయనున్నారు.

ఇప్పటికే 50 శాతంపైగా షూటింగ్ అయిపోయిందని శంకర్ చెప్పేయగా.. ఇప్పుడు మిగిలిన సగ భాగానికి సంబంధించి.. రజినీ పార్ట్ నే ముందు పిక్చరైజ్ చేయనున్నారు. రోబో సీక్వెల్ 2.0లో రజినీకాంత్ 3 గెటప్ లలో కనిపించనుండగా.. వీటిలో ఒక లుక్ ఇప్పుడు లీక్ అయింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే డిఫరెంట్ గా కట్ చేసిన సైడ్ లాక్స్ గురించే. తలపై హెయిర్ అంతగా కనిపించకపోయినా.. దీన్ని గ్రాఫిక్స్ తో మాయ చేసేస్తారనే సంగతి చెప్పాల్సిన పని లేదు.

అయినా సరే సైడ్ నుంచి చూస్తే.. ఇంత కొత్తగా కనిపిస్తున్న రజినీ గెటప్ కి సంబంధించి.. లీక్ అయిన పిక్చర్ ని ఆన్ లైన్ లో విపరీతంగా షేర్ చేసేసుకుంటున్నారు అభిమానులు. రోబోలో చూపించిన చేసిన మాయలకు మించి.. రజినీకాంత్ ఇంకేవేవో సంగతులు 2.0లో చూపిస్తారని చెప్పేందుకు పెద్దగా సందేహించాల్సిన పని లేదేమో.