తండ్రి ప్రేమలో చిరు లాగే రజని

Mon Feb 11 2019 16:24:26 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురి రెండో పెళ్లి చెన్నై లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి పళని స్వామి విచ్చేయడంతో కోలాహలం ఇంకా ఎక్కువైంది. ఇంతకు ముందే పెళ్ళైనా మొదటి భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్న సౌందర్య ఓ వ్యాపారవేత్త కుమారుడు వర్ధమాన నటుడు అయిన విశాఖన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రజని ఆత్మీయ స్నేహితుడు కమల్ హాసన్ అతిథిగా విచ్చేసి పెళ్లి వేడుకకు మరింత నిండుతనం తీసుకొచ్చారు. స్వయంగా రజని ఎదురేగి స్వాగతం పలికి కాసేపు ప్రత్యేకంగా ముచ్చట్లు చెప్పడం ఆహుతులను ఆకట్టుకుంది.రిసెప్షన్ కుటుంబ సభ్యుల మధ్య మొన్న జరుగగా వివాహ వేడుక ఇవాళ పూర్తి చేసారు. రజని కూతురి రిసెప్షన్ లో ముత్తు బాషా లాంటి హిట్ సాంగ్స్ కు డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పటికే వైరల్ అయ్యింది. సౌందర్య రజనీకాంత్ కు ఇది వరకు వేద్ కృష్ణ అనే అబ్బాయి ఉన్నాడు. విశాఖన్ కు కూడా ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. గత ఏడాది ఓ సినిమాలో నటించాడు కానీ అదేమంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు.

మరో గమనించాల్సిన అంశం ఏంటంటే అచ్చం చిరంజీవి లాగే రజనికు కూడా రెండో కూతురికి ద్వితీయ వివాహం చేయాల్సి వచ్చింది. ఏ మాత్రం భేషజాలకు పోకుండా కూతుళ్ళకు వచ్చిన కష్టాన్ని అర్థం చేసుకుని ఇలా కొత్త జీవిత భాగస్వాములను బిడ్డలకు కానుకగా ఇచ్చారు. రెండు భాషల్లో ఎవరికి వారు మెగాస్టార్ సూపర్ స్టార్ అయిన ఈ ఇద్దరికీ పిల్లల విషయంలో ఒకేరకమైన అనుభవం ఎదురుకావడం కాకతాళీయం