Begin typing your search above and press return to search.

ఇక బాహుబలి.. రోబో మాత్రమే మిగిలాయి

By:  Tupaki Desk   |   26 July 2016 4:15 AM GMT
ఇక బాహుబలి.. రోబో మాత్రమే మిగిలాయి
X
సౌత్ ఇండియాలో కొన్ని స్టార్ హీరోలు నటించిన సూపర్ హిట్ సినిమాలు ఫుల్ రన్లో సాధించిన కలెక్షన్లను తొలి రోజే దాటేసింది ‘కబాలి’. ఇక కొందరు సూపర్ స్టార్ల సినిమాల ఫుల్ కలెక్షన్లను ఫస్ట్ వీకెండ్లోనే అధిగమించేసింది ఈ సినిమా. బాహుబలి.. రోబో.. మినహాయిస్తే సౌత్ ఇండియాలో మిగతా బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కూడా ఫుల్ రన్లో సాధించిన కలెక్షన్లను ‘కబాలి’ ఫస్ట్ వీకెండ్లోనే అధిగమించేసింది. రూ.120 కోట్ల షేర్ తో ‘ఐ’ సినిమా మూడో స్థానంలో ఉండగా.. దాన్ని నాలుగో స్థానానికి నెట్టేసింది కబాలి. బాహుబలి కలెక్షన్లను అందుకోవడం కష్టం కానీ.. ‘రోబో’ను అధిగమించడం ‘కబాలి’కి కష్టం కాకపోవచ్చు. ఆ సినిమా రూ.295 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. కబాలి గ్రాస్ ఇప్పటికే రూ.211 కోట్లకు చేరింది. ఈ సినిమా రూ.350 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఒక్క తమిళనాడులోనే ‘కబాలి’ ఫస్ట్ వీకెండ్లో రూ.50 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది కబాలి. తెలుగులో మూడు రోజులకే రూ.25 కోట్ల గ్రాస్ వచ్చి పడింది. అందులో షేర్ రూ.18 కోట్లు. ఈ సినిమాకు తెలుగులో రూ.32 కోట్ల దాకా బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక్క నైజాం ఏరియాలోనే ఫస్ట్ వీకెండ్లో రూ.7.3 కోట్ల షేర్ వసూలు కావడం విశేషం. ఇండియా మొత్తంలో రూ.72 కోట్ల దాకా షేర్.. రూ.124 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా షస్ట్ వీకెండ్లో కబాలి రూ.125 కోట్ల షేర్.. రూ.211 కోట్ల గ్రాస్‌ తో సౌత్ ఇండియన్ సినిమాల్లో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఐతే వీకెండ్ తర్వాత ‘కబాలి’ జోరు ఎంత మాత్రం సాగుతుందో చూడాలి.