Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్.. లైన్ క్లియర్

By:  Tupaki Desk   |   31 Aug 2015 6:50 AM GMT
సూపర్ స్టార్.. లైన్ క్లియర్
X
రజినీకాంత్ కొత్త సినిమా విషయంలో సస్పెన్స్ కు తెరపడ్డట్లే. సెప్టెంబరు 17న వినాయకచవితి సందర్భంగా సూపర్ స్టార్ కొత్త సినిమా ‘కబాలి’ సెట్స్ మీదకు వెళ్లనుంది. టైటిల్ విషయంలో నెలకొన్న వివాదానికి నిర్మాత కలైపులి థాను తెరదించేశాడు. శివకుమార్ అనే ఓ నిర్మాత ‘కబాలి’ అనే టైటిల్ చాలా ఏళ్ల కిందటే రిజిస్టర్ చేయించాడు. ఆ పేరుతో సినిమా కూడా మొదలుపెట్టాడు. కానీ సినిమా పూర్తి కాకుండా మధ్యలో వదిలేశాడు. రజినీకాంత్ సినిమాకు ‘కబాలి’ అనే టైటిల్ అనౌన్స్ చేయగానే.. ఇది నా టైటిల్ అంటూ అడ్డం పడ్డాడు. దీని మీద పెద్ద వివాదం చెలరేగింది. ఐతే నిర్మాత థాను శివకుమార్ తో మాట్లాడి వివాదాన్ని సెటిల్ చేసుకున్నాడు. దీంతో రజినీ సినిమాకు లైన్ క్లియరైంది.

అట్టకత్తి, మద్రాస్ లాంటి సినిమాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న యంగ్ గన్ రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు. రజినీకాంత్ వయసుకు తగ్గ పాత్రలో డాన్ గా కనిపించనునండటం విశేషం. రాధికా ఆప్టే కథానాయికగా నటించబోతోంది. ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి లాంటి విలక్షణ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించబోతున్నారు. సంతోష్ నారాయణ్ సంగీత దర్శకుడు. రంజిత్ సినిమాలంటే ఎంతో వైవిధ్యంగా ఉంటాయని పేరుంది. మరి అతను రజినీ ఇమేజ్ కు తగ్గ మాస్ సినిమా చేస్తాడా? తన రూట్ లో వెళ్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రజినీ కూతురు సౌందర్య ఈ కాంబినేషన్ సెట్ చేయడం విశేషం. ‘లింగా’ సినిమాతో అభిమానుల్ని తీవ్రంగా నిరాశ పరిచిన రజినీ.. ఈ సినిమాతో తిరిగి ఫామ్ అందుకోవాలని ఆశిస్తున్నారు.