Begin typing your search above and press return to search.

మాస్ ప్లస్ మెసేజ్ ప్లస్ రజినీ

By:  Tupaki Desk   |   4 Oct 2015 5:30 AM GMT
మాస్ ప్లస్ మెసేజ్ ప్లస్ రజినీ
X
రజినీకాంత్ కబాలి ఎలా ఉంటుంది ? లింగ ఫ్లాప్ తర్వాత సూపర్ స్టార్ ఎలాంటి మూవీతో ప్రజల ముందుకు వస్తున్నారు ? ఫస్ట్ లుక్ తోనే సూపర్ గా ఎట్రాక్ట్ చేసిన కబాలి.. స్టోరీ ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేశాడు డైరెక్టర్ రంజిత్. అట్టకత్తి, మద్రాస్ మూవీలతో ఆకట్టుకున్న రంజిత్.. మూడో సినిమాకే రజినీకాంత్ తో చేసే ఛాన్స్ దక్కించుకుని.. విభిన్నమైన కాన్సెప్ట్ తో ముందుకొస్తున్నాడు.

గతంలో నార్త్ మద్రాస్ లో రౌడీలు అనిపించుకున్న వాళ్లు కొందరితో కబాలిలో కేరక్టర్స్ చేస్తున్నారు. వీళ్లలో చాలామంది సాధారణ ప్రజలకు, సమాజానికి తోచినంత మంచి చేసేవారంటున్నాడు. ముల్లం మలారుమ్ చిత్రంలో రజినీకాంత్ పోషించిన యాంగ్రీ మ్యాన్ తరహా పాత్ర కబాలిలో ఉంటుందట. అలాగని పంచ్ డైలాగ్స్ ఉండవు కానీ.. పవర్ ఫుల్ గా మాత్రం ఉంటుందట రజినీ కేరక్టర్. అయితే ఒరిజినల్ లుక్ కోసమే తెల్లగడ్డాన్ని స్టైలింగ్ గా చేర్చామంటున్నాడు. కబాలి భార్యగా రాథికా ఆప్టే చేస్తున్నట్లు చెప్పాడు రంజిత్.

కబాలి సోషల్ మెసేజ్ ఉన్న సినిమా అంటున్నారు రంజిత్. తాను తీసిన ప్రతీ మూవీలోనూ అంతర్లీనంగా మెసేజ్ ఉన్నా.. ఉపదేశాలివ్వబోమనని, ప్రజలు ఆలోచించేలా ఓ పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఉటుందంటున్నాడు. సినిమా చాలా పవర్ ఫుల్ మీడియా అని, ఓ మెసేజ్ ని మాస్ వరకూ తీసుకెళ్లా సత్తా సినిమాకు ఉందన్న రంజిత్... అదే మెసేజ్ ని రజినీకాంత్ తో ఇప్పిస్తే.. మరింతగా ఎఫెక్ట్ ఉంటందన్నాడు.