కాలా... ఇంత దారుణమా?

Wed Jun 20 2018 22:46:02 GMT+0530 (IST)

టాలీవుడ్ లో అత్యధిక మార్కెట్ ఉన్న తమిళ్ హీరో రజినీకాంత్. ఈ విషయం అందరికి తెలిసిందే. రజినీకాంత్ కేవలం తమిళ్ హీరో అంటే కూడా ఎవరు నమ్మరు. తమిళ్ ప్రేక్షకుల మాదిరిగానే తెలుగు ఆడియెన్స్ కూడా ఆయన్ను అంత బాగా ఆరాధిస్తారు. సినిమా కలెక్షన్స్ అందుకు నిదర్శనం. ఇకపోతే ఇటీవల రజినీకాంత్ నటించిన సినిమాలు అందరికంటే ఎక్కువగా తెలుగు అభిమానులను నిరాశ పరుస్తున్నాయి.అందులో కాలా అయితే మరీ దారుణం. గత సినిమాల కంటే తక్కువ షేర్స్ అందించింది. రజినీకాంత్ సినిమా ఈ రేంజ్ లో డిజాస్టర్స్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఏపి - తెలంగాణ లో కేవలం 7 కోట్ల షేర్స్ మాత్రమే అందించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గతంలో వచ్చిన లింగా కబాలి సినిమాలు కూడా ఇదే రేంజ్ లో తెలుగు ఆడియెన్స్ ని నిరాశపరిచాయి.

కబాలి సినిమా 8.80 కోట్ల షేర్స్ ను అందించింది. ఇక కాల సినిమా టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్లకు అమ్ముడుపోగ 25% మాత్రమే రికావర్ చేయడంతో బయ్యర్లు దారుణంగా నష్టపోయారని తెలుస్తోంది.

ఏరియాల వారిగా ఏపి/ తెలంగాణ షేర్స్

నైజం  2.60 Cr
సీడెడ్ 1.13 Cr
ఉత్తరాంధ్ర  0.72 Cr
గుంటూరు 0.80 Cr
తూర్పు 0.54 Cr
కృష్ణ 0.53 Cr
వెస్ట్ 0.41 Cr
నెల్లూరు 0.27 Cr
మొత్తం AP / TS 7.00 Cr