జెట్ స్పీడ్ తో `దర్భార్` షూట్

Tue Apr 23 2019 11:21:29 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే తంబీల్లో హీట్ ఎలా ఉంటుందో ఊహించేదే. పైగా 2.0 పేట చిత్రాలతో రజనీ మానియా తిరిగి ట్రాక్ లోకొచ్చింది. అందుకే ఆ రెండు సినిమాల తర్వాత రజనీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నటిస్తున్న దర్బార్ పైనే తంబీలు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అప్ డేట్ ని క్యాచ్ చేస్తూ వాడి వేడిగా చర్చకు తావిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ - మురుగదాస్ టీమ్ ముంబైలో భారీ షెడ్యూల్ చిత్రీకరణలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఆన్ లొకేషన్ రజనీ కి సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆయన ఎంతో సింపుల్ గా సాధాసీదాగా కనిపిస్తున్నారు ఈ ఫోటోల్లో.నేటి నుంచి నయనతార సెట్స్ లో జాయిన్ అవుతున్నారని టీమ్ ప్రకటించింది. తలైవా రజనీకాంత్ - తలైవి నయనతార జంటపై  కీలక సన్నివేశాల చిత్రీకరణ సాగనుందని తెలుస్తోంది. ఈ జోడీ ఇదివరకూ శివాజీ .. చంద్రముఖి.. కుసేలన్ (కథానాయకుడు) వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా నాలుగో సారి కలిసి నటిస్తుండడంతో తలైవి అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. పైగా జాతీయ అవార్డ్ గ్రహీత మురుగదాస్ లాంటి క్రేజీ డైరెక్టర్ తో సినిమా కాబట్టి అందరి అటెన్షన్ అటువైపు ఉందని అర్థమవుతోంది.

రజనీ ముంబై షూటింగ్ లో ఉన్నారు కాబట్టి `దర్బార్` చిత్రంపై బాలీవుడ్ ఫోకస్ అంతే ఇదిగా ఉంది. ఇక ఉత్తరాదిన 2.0 ఘనవిజయం నేపథ్యంలో అక్కడా `దర్బార్` పై క్రేజు నెలకొంటుందనడంలో సందేహం లేదు. బాలీవుడ్ లో అక్షయ్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న మురుగదాస్ కి క్రేజు ఉంది. 2019 సంక్రాంతి రిలీజ్ లక్ష్యంగా `దర్బార్` చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. రజనీకాంత్ ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే పోస్టర్ రిలీజై అభిమానుల్ని ఆకట్టుకుంది. రజనీ లుక్ లో ఎంటర్ టైనింగ్ మోడ్ మిక్స్ చేసి పక్కా కమర్షియల్ లుక్ లో చూపించడం ఆసక్తి పెంచింది. ఇటీవల రజనీ మార్కెట్ టాలీవుడ్ లో పూర్తి తిరోగమనంలో ఉంది. అయితే 2.0.. పేట తర్వాత మారిన ట్రెండ్ లో తమిళం- హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమాకి మార్కెట్ హైప్ ఉంటుందేమో చూడాలి.