చిందేసిన తలైవార్ ...తన్మయంలో ఫాన్స్!

Mon Feb 11 2019 10:42:13 GMT+0530 (IST)

తలైవార్ రజనీకాంత్! ఈ పేరు చెబితే అభిమానుల గుండెలు అభిమానంతో ఊగిపోతాయి. ఆయన తెరపై కనిపిస్తే చాలు ఆనందంతో ఉప్పొంగిపోయే అభిమానులు ఆయన సొంతం. ఇక ఆయన డ్యాన్స్ లు...ఆయన స్టైల్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలా?...అతిశయోక్తి కాకపోతే వాటి గురించి చెబుతూ ఉంటే మన బాష సైతం మురిసిపోతుంది.మరి అలాంటి తలైవార్ చిందేస్తే ఎలా ఉంటుంది? అదేంటి తలైవార్ చిందెయ్యడం ఏంటి?నీకేమైనా పిచ్చా..కాస్త కొత్తగా ఏమన్నా ఉంటే చెప్పు...ఆయన సినిమాల్లో ఆయన స్టైల్ తో పాటు ఆయన డ్యాన్స్ లే గా అభిమానులను కట్టి పడేసేది..కొత్తగా చెప్తారేంటీ అనేగా మీ డౌట్. అక్కడే ఉంది అసలు లాజిక్. మన తలైవార్ చిందులు వేసింది వెండి తెరపైలో లేక సినిమా సెట్ లోనో కాదండి బాబు...స్నేహితులు - బంధువులు - అందరితో కలసి తన కుమార్తె పెళ్లి సంగీత్ లో తన మార్క్ డ్యాన్స్ తో 'కబాలి డా' అనిపించాడు అంటే నమ్మండి.

ఇక అసలు మ్యాటర్ ఏంటి అంటే...రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ వివాహం తమిళ నటుడు - బడా పారిశ్రామిక వేత్త  అయినటువంటి విషగన్ తో ఈరోజు జరగనుంది. అయితే ఈ పెళ్లి సంగీత్ లో కుటుంభ సభ్యులు అందరితో కలసి రజనీకాంత్ డ్యాన్స్ వేశాడు. ఇక ఆ వీడియో ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్ గా మారి హల్ చల్ చేస్తుంది. సహజంగా సినిమాల్లో రజనీకాంత్ డ్యాన్స్ లు చూసిన ఆయన ఫాన్స్ ఆయన డ్యాన్స్ ను లైవ్ లో చూసి పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా 68 ఏళ్ల రజనీకాంత్ ఆ రేంజ్ లో డ్యాన్స్ వేస్తూ ఉంటే - ఫిదా కాకుండా ఉండగలరా ఆయన ఫాన్స్. ఇక రేపు చెన్నై లో గ్రాండ్ గా రిసెప్షన్ జరగనుంది. మొత్తంగా అదన్న మాట అసలు మ్యాటరు.