Begin typing your search above and press return to search.

ర‌జినీ 5.. అక్ష‌య్ కుమార్ 12

By:  Tupaki Desk   |   27 March 2017 1:59 PM GMT
ర‌జినీ 5.. అక్ష‌య్ కుమార్ 12
X
ర‌జినీ ఐదేంటి.. అక్ష‌య్ కుమార్ ప‌న్నెండేంటి..? ఏంటీ అంకెల గోల అంటారా? రోబో సీక్వెల్ 2.0లో వీళ్లిద్ద‌రూ క‌నిపించ‌బోయే అవ‌తారాల సంఖ్య ఇది. రోబోలో మూడు భిన్న‌మైన అవ‌తారాల్లో ద‌ర్శ‌న‌మిచ్చిన ర‌జినీ సీక్వెల్లో మ‌రింత వైవిధ్యంగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఆయ‌న ఏకంగా ఐదు ర‌కాల లుక్స్ లో షాకివ్వ‌నున్నాడ‌ట‌. చిట్టి రోబో.. సైంటిస్ట్ వ‌శీ.. నెగెటివ్ షేడ్స్ ఉన్న రోబో.. ఇంకా మ‌రో రెండు కొత్త అవ‌తారాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడ‌ట సూప‌ర్ స్టార్. ఆయ‌న లుక్స్ అభిమానుల్ని ఉర్రూత‌లూగించ‌డం ఖాయ‌మ‌ని అంటున్నాయి యూనిట్ వ‌ర్గాలు.

మ‌రో వైపు అక్ష‌య్ కుమార్ ర‌జినీని మించిపోతాడ‌ట‌. అత‌ను ఏకంగా 12 ర‌కాల అవ‌తారాల్లో ద‌ర్శ‌న‌మిస్తాడ‌ట‌. స‌న్నివేశానికి ఒక ర‌కంగా ప‌న్నెండు ర‌కాల అవ‌తారాల్లో అక్ష‌య్ వైవిధ్యం పంచుతాడ‌ని.. అత‌డి పాత్ర చాలా ఎగ్జైటింగ్ గా ఉంటుంద‌ని చెబుతున్నారు. 2.0లో రియ‌ల్ హీరో అక్ష‌యే అని.. అత‌ను ఈ చిత్రం కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌ని ర‌జినీ ఇంత‌కుముందే చెప్పిన సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది రిలీజైన ర‌జినీ.. అక్ష‌య్ ల ఫ‌స్ట్ లుక్స్ అభిమానుల్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ఫ‌స్ట్ లుక్స్ తోనే ఈ సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. దాదాపు రూ.400 కోట్ల బ‌డ్జెట్లో శంక‌ర్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/