Begin typing your search above and press return to search.

ప్చ్.. మళ్లీ అక్కడి సినిమాటోగ్రాఫరే

By:  Tupaki Desk   |   25 Feb 2017 5:19 PM GMT
ప్చ్.. మళ్లీ అక్కడి సినిమాటోగ్రాఫరే
X
అల్లు అర్జున్ తన అభిమానులకి కొత్త యాంగిల్ పరిచయం చేయడంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాడు. అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియాని.. అనుకూలంగా మార్చుకోవడంలో బన్నీని మించి భారీగా సక్సెస్ ని టేస్ట్ చేసిన వారు మరొకరు కనిపించరు.

ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ప్రెజెంట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తాడు అల్లు అర్జున్. సినిమాల సెలక్షన్ విషయంలోనూ.. బన్నీ టేస్ట్ ఇక్కడ తెలిసిపోతుంది. గతేడాది రిలీజ్ అయిన సరైనోడు చిత్రానికి రిషి పంజాబీని సినిమాటోగ్రాఫర్ గా సెట్ చేయడానికి.. ఎంత కష్టపడాల్సి వచ్చిందో స్వయంగా అల్లు అరవింద్ చెప్పిన మాటలు మర్చిపోలేం. ఇప్పుడు సెట్స్ పై ఉన్న దువ్వాడ జగన్నాధం పరిస్థితి కూడా ఇంతే. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయాంకా బోస్ ని రంగంలోకి దించేశారు.

కానీ బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలోనే సమస్య ఎదురవుతోంది. బాంబే వెల్వెట్ మూవీకి వర్క్ చేసిన రాజీవ్ రాయ్ ని తీసుకుందామన్నది అల్లు అర్జున్ అలోచన. కానీ అంత కాస్ట్లీ సినిమాటోగ్రాఫర్ ని తీసుకుంటే బడ్జెట్ భారీగా పెరిగిపోతుందని నిర్మాతల యోచన. ఇప్పటికైతే ఇంకా తెగలేదు కానీ.. ప్రస్తుతం బన్నీ సినిమా హాట్ టాపిక్ మాత్రం ఇదే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/