Begin typing your search above and press return to search.

డాట్టరు గారు.. నెక్స్ట్ ఏంటి?

By:  Tupaki Desk   |   17 Nov 2017 5:30 PM GMT
డాట్టరు గారు.. నెక్స్ట్ ఏంటి?
X
ఎన్నో అపజయాలు మనిషిని అడుగడుగున జీవితంలో ఎంతో బాధకు గురి చేస్తాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అయితే ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా అపజయాలు జీవితాన్నే మార్చేస్తాయి. అయితే ఒకే ఒక్క హిట్ అందితే మాత్రం బాధలన్నీ బాక్స్ ఆఫీస్ ముందు బద్దలైపోతాయి. ఆ విజయం చాలా నేర్పిస్తుందనే చెప్పాలి. అయితే ఇలాంటి అనుభవాన్నే రీసెంట్ గా చూసిన డా. రాజశేఖర్ ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

చాలా కాలం తర్వాత పిఎస్వి గరుడవేగ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాజశేఖర్ ఆ సినిమా హిట్ కోసం ఎంత తాపత్రయ పడ్డాడో అందరికి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన రాజశేఖర్ నెక్స్ట్ ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తాడని అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ హీరో మాత్రం తొందరపడకుండా కొంచెం గ్యాప్ తీసుకొని నెక్స్ట్ సినిమా గురించి ఆలోచిస్తాడట.

గరుడవేగ హిట్ తో దర్శకుడు సీక్వెల్ ని ప్లాన్ చేసందుకు సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది. అయితే అంతకంటే ముందే ఇద్దరు మరొక సినిమాను పూర్తి చేసుకొని సీక్వెల్ గురించి ఆలోచిస్తారట. ప్రవీణ్ సత్తారు పుల్లెల గోపీచంద్ బయోపిక్ తో ప్రస్తుతానికి బిజీగా ఉన్నాడు. రాజశేఖర్ ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ తప్పకుండా ఒక మంచి కాన్సెప్ట్ తో రావాలని ఈ సీనియర్ హీరో అనుకుంటున్నాడు.