Begin typing your search above and press return to search.

న‌టుడు రాజ‌శేఖ‌ర్ కారుకు ప్ర‌మాదం

By:  Tupaki Desk   |   9 Oct 2017 5:32 AM GMT
న‌టుడు రాజ‌శేఖ‌ర్ కారుకు ప్ర‌మాదం
X
కంగారుప‌డాల్సిందేమీ లేదు. యాక్సిడెంట్ అయిన‌ప్ప‌టికీ ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాక‌పోవ‌టం ఊపిరి పీల్చుకోవాల్సిన అంశం. ఆదివారం అర్థ‌రాత్రి చోటు చేసుకున్నకారు యాక్సిడెంట్‌లో న‌టుడు రాజ‌శేఖ‌ర్ తో పాటు.. మ‌రోకారులోప్ర‌యాణిస్తున్న వారికి కూడా ఏం కాలేదు. ఇంత‌కీ.. కారు ప్ర‌మాదం ఎలా జ‌రిగింది? కార‌ణం ఏమిట‌న్న విష‌యాల్లోకి వెళితే..

సినీ న‌టుడు రాజ‌శేఖ‌ర్ ఆదివారం అర్థ‌రాత్రి కారులో వెళుతున్నారు. రాజేంద్ర‌న‌గ‌ర్ పీవీ ఎక్స్ ప్రెస్ వే ముందు నుంచి వెళుతున్న రామిరెడ్డి అనే వ్య‌క్తి కారును న‌టుడు రాజ‌శేఖ‌ర్ కారు ఢీ కొట్టింది. దీంతో.. ఇరువురి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. త‌ప్పు మీదంటే మీద‌న్న‌ట్లుగా వాదులాడుకున్న‌ట్లు చెబుతున్నారు.

ఈ సంద‌ర్భంగా తాగి వాహ‌నం న‌డుపుతున్న‌ట్లుగా న‌టుడు రాజ‌శేఖ‌ర్‌ పై రామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. త‌న త‌ల్లి చ‌నిపోయిన డిప్రెష‌న్ లో కారు న‌డ‌ప‌టం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిందే త‌ప్పించి తాను మ‌ద్యాన్ని సేవించ‌లేద‌న్నారు. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు.. బ్రీత్ ఎన‌లైజ‌ర్ ద్వారా న‌టుడు రాజ‌శేఖ‌ర్‌ ను ప‌రీక్షించారు. రాజ‌శేఖ‌ర్ మ‌ద్యం సేవించ‌లేద‌ని తేలింది. ఈ నేప‌థ్యంలో న‌టుడు రాజ‌శేఖ‌ర్‌ పై కేసు పెట్టిన రామిరెడ్డి త‌న ఫిర్యాదును వెన‌క్కి తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.