Begin typing your search above and press return to search.

కూతురి హీరో కోసం నాన్న మాట

By:  Tupaki Desk   |   25 Jun 2019 4:58 AM GMT
కూతురి హీరో కోసం నాన్న మాట
X
వచ్చే నెల విడుదల కానున్న ఆనంద్ దేవరకొండ దొరసాని మీద భారీ అంచనాలు లేవు కానీ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాక ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిన మాట వాస్తవం. దానికి తోడు ఆడియోకు డీసెంట్ టాక్ రావడం ప్లస్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి ప్రతిదీ పాజిటివ్ గా లేదు. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ లుక్స్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రాలింగ్ జరిగింది. కేవలం అన్నయ్య విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి తన లక్ టెస్ట్ చేసుకోవడానికి వచ్చినట్టు ఉందని చాలానే కామెంట్స్ వచ్చాయి.

ఇది చాలదు అన్నట్టు కల్కి డాన్సింగ్ ఛాలెంజ్ కోసం దొరసాని హీరోయిన్ రాజశేఖర్ రెండో కూతురు శివాత్మికతో కలిసి చేసిన డాన్స్ బిట్ విమర్శల పర్వాన్ని ఇంకా ఎక్కువ చేసింది. దీనికి సమాధానం యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఇస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కథ డిమాండ్ మేరకు ఆనంద్ దేవరకొండ అలా కనిపిస్తున్నాడు తప్ప మరో కారణం కాదని చెబుతున్నాడు. దొరసానిలో తన కూతురూ లాంచ్ అవుతోంది కాబట్టి ఇలాంటి నెగటివ్ కామెంట్స్ కి బదులు చెప్పే బాధ్యత రాజశేఖర్ కూడా తీసుకున్నారన్న మాట.

సహజంగా ఉండాలనే ఉద్దేశంతో లుక్ ని అలా డిజైన్ చేశారట. అయినా ఎంత కథ డిమాండ్ చేసినా బయట కూడా అలాగే కనిపించమని చెప్పదు కదా. మొదటి సినిమా కాబట్టి లుక్స్ పరంగా మరీ ఎక్కువ ఆశించడం భావ్యం కాదు కానీ ట్రాలింగ్ వీరుల పుణ్యమా అని ఆనంద్ వాళ్ళకో సబ్జెక్టు గా మారాడు అంతే. శివాత్మిక లుక్స్ వరకు ఆనంద్ కంటే బెటర్ రెస్పాన్స్ దక్కించుకోవడం గమనార్హం. వచ్చే నెల 12 రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న దొరసానికి కెవిఆర్ మహేంద్ర దర్శకుడు