Begin typing your search above and press return to search.

పాతిక కోట్లా? వర్కవుట్ అవుద్దా??

By:  Tupaki Desk   |   27 May 2017 10:10 AM GMT
పాతిక కోట్లా? వర్కవుట్ అవుద్దా??
X
సీనియర్ హీరో రాజశేఖర్ ఈ మధ్య అస్సలు లైమ్ లైట్ లో లేడు. ఈ మధ్య రాజశేఖర్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. పట్టుమని వారం కూడా ఆడకుండా థియేటర్ల నుంచి వెళ్లిపోయిన సినిమాలే ఎక్కువ. అప్పుడెప్పుడో వచ్చిన ‘ఎవడైతే నాకేంటి’ తప్ప మిగతా సినిమాలు జనాలకు గుర్తు కూడా లేవంటే ఆశ్చర్యం కాదు. రాజశేఖర్ తోపాటు హీరోలుగా నటించిన వారంతా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారి చాలాకాలమైంది. కానీ రాజశేఖర్ ఇంకా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు.

తాజాగా రాజశేఖర్ హీరోగా నటిస్తున్న పి.ఎస్.వి. గరుడ వేగ 125.8 సినిమాను పాతిక కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్నారనే న్యూస్ ఫిలింనగర్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న రాజశేఖర్ కమ్ బ్యాక్ మూవీకి ఈ రేంజిలో ఖర్చు చేయడం విశేషమనే చెప్పాలి. కోటేశ్వరరావు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు గుంటూరు టాకీస్ ఫేం ప్రవీణ్ సత్తారు డైరెక్టర్. ఈ సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడటం లేదంటున్నారు ప్రొడ్యూసర్, డైరెక్టర్. బ్యాంకాంక్, జార్జియాలోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో ఇప్పటికే కొంత భాగం షూటింగ్ చేశారు.

గరుడ వేగ సినిమాలో స్టంట్ సీన్లు హాలీవుడ్ స్టంట్ కో ఆర్డినేటర్ల సూపర్ విజన్ లో చేస్తున్నారు. ఇవి ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయంటున్నారు. కమల్ హాసన్ సినిమాలు విశ్వరూపం ఉత్తమ విలన్ లో నటించిన పూజాకుమార్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. దీనికితోడు సెక్సీభామ సన్నీలియోన్ కూడా ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ రేంజి బడ్జెట్ వర్కవుట్ అవుతుందంటారా... చూడాలి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/