Begin typing your search above and press return to search.

మెగధీరులతో జక్కన్న.. కేరాఫ్‌ రంగస్థలం

By:  Tupaki Desk   |   20 Sep 2017 10:11 AM GMT
మెగధీరులతో జక్కన్న.. కేరాఫ్‌ రంగస్థలం
X
ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినా ఒక దర్శకుడు - హీరో కాంబినేషన్ బలంగా ఉంటేనే విడుదలకు ముందు సినిమా భారీ స్థాయిలో ఆదరణను దక్కించుకుంటుంది. అటువంటి కాంబినేషన్ లు మన సౌత్ లో చాలానే ఉన్నాయని చెప్పాలి. కానీ అవి మరొకసారి రిపీట్ అయితే చాలా బావుంటుందని ప్రతి ఒక్క అభిమాని అనుకుంటాడు. అయితే ఇప్పుడు చాలా మంది అభిమానుల మదిలో మెదులుతున్న ఒక కాంబో సెట్ అవ్వడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత ఏ సినిమా తీస్తాడు అన్నది ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ బాగా వినిపిస్తోంది.

ఆయన ఇప్పటివరకు తీసిన హీరోల కాంబినేషన్ ని మళ్లీ రిపీట్ చేస్తాడా ? లేక ఎప్పుడు చేయని హీరోలతో చేస్తాడా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాజమౌళి వ్యవహరిస్తన్నా తీరును చూస్తుంటే మరొకసారి మగధీర కాంబినేషన్ మళ్లీ రిపీట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి ఈ మధ్య మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కాస్త క్లోజ్ గా ఉండడం ఈ అనుమానాలకు దారి తీస్తున్నాయి. మొదట రాజమౌళి చిరు 151వ మూవీ "సైరా" టైటిల్ లాంచ్ వేడుకలో పాల్గొనడం.. అలాగే విజయేంద్రప్రసాద్ "శ్రీవల్లి" ఫ్రీ రిలీజ్ లో రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా వెళ్లడం చూస్తుంటే.. వీరిద్దరి ఎదో ఒక భారీ ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సారి రాజమౌళి ,చిరుతో కలిసి రంగస్థలం -1985 షూటింగ్ కి వెళ్లడం కూడా పలు అనుమానాలకు దారి తీస్తోంది.

మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చిరు - రామ్ చరణ్ కోసం ఒక కథ రాయాలని ఉందని రచయిత విజయేంద్ర ప్రసాద్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక ఆయన వారిద్దరి కోసం కథ రాస్తే ఆ సినిమాను రాజమౌళి మాత్రమే తెరకెక్కిస్తాడని చెప్పవచ్చు. అయితే ఆ ప్రాజెక్ట్ కి సంబందించి ఏదైనా బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుగుతుందా అనే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. సాధారణంగా ఒక స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు దర్శకుడు - హీరో చాలా టచ్ లో ఉంటారు. ఆ ప్రాజెక్ట్ తో అలా అలా డిస్కస్ చేస్తూ.. ముందుకు వెళుతూ ఉంటారు. మరి జక్కన్న తీరును చూస్తుంటే.. మెగా ధీరులకోసం తండ్రితో కథ సిద్ధం చేస్తున్నట్లే అనిపిస్తోంది. చూద్దాం ఎన్ని రోజులు ఆ రహస్యాన్ని దాచి ఉంచుతారో. ప్రస్తుతానికి రంగస్థలం షూటింగును మెగధీరులతో కలసి రాజమౌళి ఎంజాయ్ చేస్తున్నాడు.