Begin typing your search above and press return to search.

ఈగ 2 నాతోనే అంటున్న నాని

By:  Tupaki Desk   |   4 Sep 2015 10:46 AM GMT
ఈగ 2 నాతోనే అంటున్న నాని
X
రిలీజ్ ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భలేభలే మగాడివోయ్ మూవీని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు కంకణం కట్టుకున్నాడు. వరుసగా ఫ్లాప్స్ ఉన్నా.... మారుతీ డైరెక్షన్ లో రూపొందిన ఈ చిత్రంపై బోలెడు అంచనాలున్నాయి. మతిమరుపు మగాడిగా... తన సొంత కేరక్టర్ నే చేస్తున్నానని చెప్పి ఇప్పటిగే ఆశ్చర్యపరిచిన నాని.. నెక్ట్స్ ప్రాజెక్ట్ డీటైల్స్ ఇచ్చి ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అధి కూడా తన తర్వాతి సినిమా కాదండీ... బాబుబలి సీక్వెల్ తర్వాత రాజమౌళి చేయబోతున్న మూవీ డీటైల్స్ చెప్పేశాడు నాని.

ఒక్క స్టార్ హీరో లేకుండా.. ఓ చిన్న జీవి ఈగను మెయిన్ కేరక్టర్ గా చేసి తనే సృష్టించిన గ్రాఫిక్ మాయాజాలం ఈగకు.. సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న. ఇప్పటివరకూ మహేష్ బాబు తో రాజమౌళీ తర్వాతి సినిమా ఉంటుందన్న అంచనాలపై... నీళ్లు చల్లేశాడు నాని. ఓ టైంలో మహాభారతాన్ని తీయాలనే ఆలోచన ఉందని కూడా చెప్పాడు రాజమౌళి. అయితే... నాని లీక్ ఇచ్చేయడంతో.. దర్శకధీరుడు ఇప్పటికే స్టోరీలైన్ సిద్ధం చేయిస్తున్నాడనే విషయం అర్ధమైపోయింది. కానీ ఇందులో తన కేరక్టర్ ఏంటో.. మాత్రం చెప్పేందుకు ససేమిరా అంటున్నాడు ఈ బోర్న్ యాక్టర్.

మొత్తానికి ఇప్పటి సినిమాకి క్రేజ్ తెచ్చేందుకు.. ఏడాది తర్వాత మొదలుకాబోయే ప్రాజెక్ట్ డీల్స్ ని ఉపయోగించుకుంటున్నాడంటే..నాని నిజంగానే భలే మగాడే.