Begin typing your search above and press return to search.

నా జీవితాన్నేభ‌లే కాపీ కొట్టేశావ్ - రాజ‌మౌళి

By:  Tupaki Desk   |   4 Sep 2015 7:52 PM GMT
నా జీవితాన్నేభ‌లే కాపీ కొట్టేశావ్ - రాజ‌మౌళి
X
నాని - లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఈరోజు రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి అన్నిచోట్ల నుంచి పాజిటివ్ టాక్ వినిపించింది. ఇదో చ‌క్క‌ని కామెడీ ఎంట‌ర్‌ టైన‌ర్‌, రొమాన్స్ అదిదిపోయిందంటూ రిపోర్ట్ వ‌చ్చింది. బిబిఎం ప్రివ్యూ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌సాద్స్ ఐమాక్స్‌ లో చూశారు. లేటెస్టుగా జ‌క్క‌న్న ట్విట్ట‌ర్‌లో త‌న అభిప్రాయం చెబుతూ.. నాని పెర్ఫామెన్స్ అద్బుతం. న‌వ‌లా క‌థానాయ‌కుడిలా చ‌క్క‌గా న‌టించాడు. షోస్టాప‌ర్‌గా నిలిచాడు. చ‌క్క‌ని ఫ‌న్ ఫిలిమ్‌. లావ‌ణ్య అడోర‌బుల్‌.. అంటూ పొగిడేశాడు.

నాని క్యారెక్ట‌రైజేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్థావిస్తూ.... ఈ సినిమాలో నాని క్యారెక్ట‌ర్ లో నా నిజ‌జీవితాన్ని చూసుకున్నా. సినిమాలో చాలా సీన్లు నా జీవితంలో జ‌రిగిన‌వే. నానీ బ‌దులు అది నేనేనా అనిపించింది.. అంటూ ట్వీట్ చేశారు జ‌క్క‌న్న‌. గ‌తంలో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని ఈగ సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత మ‌ళ్లీ నానీని ఆకాశానికెత్తేస్తూ ఇన్నాళ్టికి మ‌ళ్లీ ట్వీటాడు రాజ‌మౌళి. జ‌క్క‌న్న పొగ‌డ్త నానీకి బూస్ట్ లాంటిది. దేశ విదేశాల్లో క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఓ పెర్ఫెక్ట్ కామెడీ రొమాంటిక్ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా భ‌లే భ‌లే మ‌గాడివోయ్ పేరు తెచ్చుకుంది. కాబ‌ట్టి హిట్టుకి ఈ పొగ‌డ్త ఫైర్ యాడెడ్ టు ద పెట్రోల్‌లా ప‌నికొస్తుంద‌న్న‌మాట‌!